మగాళ్ళు దేవతలను పూజిస్తారు కానీ, ఇంట్లో పెళ్లాలను మాత్రం దారుణంగా...

తెలుగులో బుల్లి తెరపై పలు ధారావాహికలలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటించి అలరించిన ప్రముఖ సీనియర్ నటి నవీన గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అయితే తాజాగా నటి నవీన ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొంది.

 Telugu Character Artist Naveena Sensational Comments On Casting Couch In Film In-TeluguStop.com

 ఇందులో భాగంగా మహిళలపై జరుగుతున్న టువంటి ఆకృత్యాలు గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

అయితే తాను ఓ సీరియల్ మరియు సినిమాలో నటిస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తరచూ ఫోన్ చేసి విసిగించేవాడని అలాగే తనకు ఇష్టం లేదని ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వారం, పది రోజుల గ్యాప్ తర్వాత ఫోన్ చేస్తూనే ఉండేవాడని చెప్పుకొచ్చింది.

 ఆతర్వాత మగాళ్లు మొదటగా ఆడవాళ్ళ వెంట పడతారని కానీ ఒకసారి ఆడవాళ్ళు వారికి లొంగిపోయిన తర్వాత మళ్ళి ఆడవాళ్ళని మగాళ్లు తమ వెంట తిప్పుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేసింది.

Telugu Naveena, Serial Actress, Telugucharacter, Tollywood-Movie

అలాగే ఈ మధ్య కాలంలో కొందరు మగాళ్లు బయటకి వెళ్లి గుడిలో ఉన్నటువంటి దేవతలని పూజిస్తారు. కానీ తమ ఇంట్లో ఉన్నటువంటి  పెళ్ళాం ని మాత్రం దారుణంగా టార్చర్ పెడుతుంటారని ఇది సరికాదని తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆడదంటే ఆది పరాశక్తి తో సమానమని కానీ ఆమెని పూజించక పోయినా పర్లేదు కానీ అసభ్య పదజాలంతో దూషించడం, అగౌరవ పర్చడం వంటివి చేయద్దని కోరింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి నవీన తెలుగులో ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానల్ అయిన స్టార్ మా ఛానల్ లో ప్రసారమయ్యే “కోయిలమ్మ” అనే ధారావాహికలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటిస్తోంది. అంతేగాక పలు టాలీవుడ్ చిత్రాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తోంది.

ఆ మధ్య తన పాత్రకి ప్రాధాన్యత ఉన్నటువంటి అవకాశం వస్తే తమిళ, కన్నడ, మలయాళం, హిందీ, తదితర భాషల్లో కూడా నటిస్తానని తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube