పవన్ కు పవర్ షేరింగ్ తప్పదా?

జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే జనసేన( Janasena )కు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వటం అత్యవసరం అన్న పరిస్థితికి తెలుగుదేశం శ్రేణులు వచ్చాయా అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.నిన్న మొన్నటి వరకు జనసేనను ఒక మైనర్ భాగస్వామి అని ఆ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చిన అవి వృధా అవుతాయని అంతేకాకుండా గెలుపు గుర్రాలను పక్కనపెట్టి జనసేనకు ఇస్తే రెండు పార్టీలు నష్టపోతాయని కొంతమంది స్వయం ప్రకటిత తెలుగు దేశం మేధావులు వాటి అనుకూల మీడియా లలో విశ్లేషించేవారు.

 Tdp Ready To Share Power With Pawan Kalyan?,pawan Kalyan,tdp,janasena,chandrabab-TeluguStop.com

అయితే ప్రతిపక్ష పార్టీ అంటే ఎలా ఉండాలో డి అంటే డి అంటూ ఎలా తలపడాలో ప్రభుత్వ వ్యవస్థలైన పోలీసుల తో గాని న్యాయవ్యవస్థతో ఎలా పోరాడాలో జనసేన చేసి చూపించింది చెప్పుకోవడానికి ఒక ఎమ్మెల్యే లేకపోయినా రాష్ట్రంలో కీలకమైన సమస్యలపై జనసేన చేసిన గ్రౌండ్ లెవెల్ యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో ఒక బలమైన పార్టీగా జనసేన తన ముద్రను బలంగా వేసింది అన్న విశ్లేషణలు వినిపించాయి.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Tdpready, Ys Jagan-Telugu Politi

ఇప్పుడు చంద్రబాబు అరెస్టు( Chandrababu Arrest ) లాంటి కీలక సమయంలో పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నిలబడిన విధానం తెలుగుదేశం శ్రేణులకు మద్దతుగా వ్యవహరించిన పద్ధతి చూసి చాలామంది తెలుగుదేశం హార్డ్ కోర్ అభిమానులు కూడా ఫిదా అయ్యారు .ఇప్పుడు జనసేనతో కలిసి అధికారం పంచుకోవడానికి తెలుగుదేశంలోని మెజారిటీ నాయకులు సిద్దపడుతున్నారన్నది కొత్త విశ్లేషణ .కలిసి వచ్చే వారే మిత్రులుగా భావించాలని పక్కనుండి వేడుక చూసే వారి కన్నా కలిసి నడిచిన వారికి మరింత ప్రేమను పంచాల్సిన అవసరం ఉందని, నిన్న మొన్నటి వరకూ తాము గెలవడానికి జనసేనను ఒక మెట్టుగా ఉపయోగించుకోవాలన్న వారికి ప్రస్తుత పరిణామాలతో కనువిప్పు కలిగిందని జనసేన ను అధికారిక భాగస్వామిగా ప్రకటించకపోతే జనసేన కన్నా ఎక్కువగా నష్టపోయేది తెలుగుదేశమేనని, ఈసారి గనక జగన్ ప్రభుత్వం( YS Jagan Govt ) రిపీట్ అయితే తెలుగుదేశం మూలాలు కదిలిపోతాయన్న అంచనాకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చే అనేక వర్గాలు వచ్చాయని స్పష్టంగా తెలుస్తుంది .దాంతో మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితిని తెలుగుదేశానికి సృష్టించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితికి రాజకీయ విశ్లేషకులు ముచ్చట పడుతున్నారు.

Telugu Ap, Chandrababu, Janasena, Pawan Kalyan, Tdpready, Ys Jagan-Telugu Politi

విభజించి పాలించే సిద్ధాంతానికి వ్యతిరేకంగా కలిసి గెలుద్దాం అంటూ కొత్త సమీకరణాన్ని తీసుకొచ్చిన జనసేన అధ్యక్షుడు రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త మార్పుకు నాంది పలుకుతున్నట్లే ఉంది.మరి జనసేన స్నేహ హస్తానికి తెలుగుదేశం కూడా అదే స్థాయిలో రియాక్ట్ అయితే ఒక సరికొత్త రాజకీయ పంథా ను నిర్మించిన వారు అవుతారు.మరి మెజారిటీ అభిప్రాయాన్ని తెలుగుదేశం అధినాయకత్వం గుర్తించి గౌరవిస్తుందో లేదో వేచి చూడాలి

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube