ఎలాన్ మస్క్‎ను చంద్రబాబు కలిశారంటూ టీడీపీ పిక్.?.. మార్ఫింగ్ అంటూ..!!

టెస్లా అధినేత ఎలాన్ మస్క్( Elon Musk ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.అయితే మస్క్ ఈ నెల 22న భారత్ పర్యటనకు రానున్నారు.

 Tdp Pic Saying That Chandrababu Met Elon Musk Morphing , Tdp Pic, Chandrababu,-TeluguStop.com

ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేచి చేస్తున్నాయి.భారత్ లో టెస్లా కార్ల ప్లాంట్ ను నెలకొల్పాలనే యోచనలో ఉన్న మస్క్ ను ఏపీతో పాటు కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

ఇదంతా కాసేపు పక్కన పెడితే టీడీపీ నేత నారా లోకేశ్( Nara Lokesh ) చేసిన ఓ ట్వీట్ పై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎలాన్ మస్క్ ను ట్యాగ్ చేస్తూ నారా లోకేశ్ ఓ ట్వీట్ చేశారు.మస్క్ భారత్ ను సందర్శిస్తారన్న వార్త తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందన్న లోకేశ్.గతంలో చంద్రబాబు మస్క్ ని కలిసిన ఫోటో ను ట్వీట్ చేశారు.

అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.దానిపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతోంది.

కానీ చంద్రబాబు ఎలాన్ మస్క్ ను కలిశారని, ఆయనతో భేటీ అయ్యారనే వార్త ఎలాంటి మీడియాలోనూ రాలేదు.

అయితే చంద్రబాబు, మస్క్ ను కలిసినట్లు ఉన్న ఫోటో టీడీపీ ఖాతాల్లో తప్ప మరెక్కడా కనిపించడం లేదని తెలుస్తోంది.దీనిపై ఆరా తీసిన కొందరు ఇది మార్ఫింగ్ పిక్ అని తేల్చేశారని సమాచారం.చంద్రబాబు పక్కన ఎలాన్ మస్క్ ను అతికించి లోకేశే ఈ ఫోటోను పోస్ట్ చేశారంటూ పలు ఆరోపణలు వస్తున్నాయి.ఫోటోతో పాటు టెస్లా మీద ఫేక్ లెటర్ ను కూడా పోస్ట్ చేయడం గమనార్హం.

అయితే ఏపీలో త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో పబ్లిసిటీ కోసమే ఎలాన్ మస్క్ భారత్ కు వస్తున్న అవకాశాన్ని టీడీపీ నేతలు వాడుకుంటున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారని సమాచారం.ఎన్నికల కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారా అంటూ ధ్వజమెత్తుతున్నారట.

ఎవరెన్నీ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా ఏపీలో వైసీపీనే మరోసారి అధికారంలోకి వస్తుందని ఏపీ ప్రజలు చెబుతుండటం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube