తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు( Chandrababu arrest ) కావడం ఆ పార్టీ నేతలకు తీవ్ర ఆవేదనను గురిచేస్తుంది.మరోపక్క బెయిల్ కోసం టీడీపీ లీగల్ టీం న్యాయపోరాటం చేస్తుంది.
సరిగ్గా ఎన్నికల సమయంలో ఓటమి భయంతోనే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసినట్లు టీడీపీ నేతలు మండిపడుతున్నారు.ఇదే సమయంలో రిలే నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నారు.
తాజాగా చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు( Pratipati Pulla Rao ) ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఈ రిలే నిరాహార దీక్ష ఏడవ రోజుకు చేరుకోవడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో.
వైసీపీ ఓడిపోతుందని స్పష్టం చేశారు.
పోలీసులను జగన్( CM ys jagan ) తన ప్రైవేట్ సైన్యంగా మార్చుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు.
అధికారం కోల్పోతున్నారని.తెలిసే జగన్ బరితెగించారు.
చంద్రబాబుపై కుట్రలు ఆపకపోతే ప్రజలు తిరగబడటానికి రోడ్లపైకి రావడానికి సిద్ధంగా ఉన్నారు.ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని నారా లోకేష్ నీ కూడా ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు ప్రతిపాటి పుల్లారావు ఆరోపించారు.
చంద్రబాబుకి మద్దతుగా దేశ విదేశాలలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయని.మహిళలు అదేవిధంగా యువత ప్రజలంతా రోడ్లపైకి వస్తున్నారని పేర్కొన్నారు.
పోలీసులను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షాలను అధికార పార్టీ అణచివేయడం దారుణం అనీ ప్రతిపాటి పుల్లారావు పేర్కొన్నారు.