తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు( Chandrababu ) సతీమణి నారా భువనేశ్వరి వీడియో రూపంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులకి సందేశం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ( Telugu Desam Party ) ఒక కుటుంబం.
పార్టీ కార్యకర్తలు మా బిడ్డలతో సమానం.అటువంటి బిడ్డలు ఈరోజు తల్లిదండ్రుల కోసం హింసించబడుతున్నారు.
మా బిడ్డలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.తప్పుడు కేసులు వల్ల జైలుకెళ్తున్నారు.
తల్లిదండ్రుల కోసం పార్టీ జెండా రెపరెపలాడటం కోసం మా బిడ్డలు లాఠీ దెబ్బలు కూడా తింటున్నారు.స్త్రీలు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిణామాలన్ని చూస్తే రాష్ట్రంలో నాయకత్వం ఎలా ఉందో అర్థమవుతుంది అని నారా భువనేశ్వరి ( Nara Bhuvaneshwari )ఆవేదన వ్యక్తం చేశారు.జైల్లో చంద్రబాబుని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆరోపించారు.
జైలులో భోజనం చేసేందుకు చంద్రబాబుకి కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదు.ప్రత్యేక అనుమతి తీసుకుంటేనే మూలాఖత్ కు అనుమతి ఇచ్చారు.
జైల్లో చంద్రబాబు నాయుడు( Chandrababu ) ధైర్యంగా ఉన్నారు.రాష్ట్రంలో శాంతియుత ర్యాలీలను సైతం ప్రభుత్వం అణిచివేస్తుంది.
అని మండిపడ్డారు.ఇటువంటి కష్ట సమయంలో పార్టీకి చంద్రబాబుకి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ నారా భువనేశ్వరి వీడియో రూపంలో సందేశం ఇచ్చారు.