టీడీపీ వ్యూహకర్తగా పీకే టీమ్ సభ్యుడు ? విబేధాలు రావడంతోనే ?

గతంలో ఉన్నట్టుగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు లేకపోవడంతో మొత్తం అన్ని వ్యవహారాలను పార్టీ అధ్యక్షులు చూసుకోవడం కష్టతరంగా మారింది.ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలకు వ్యూహ కర్తలు అవసరం ఏర్పడింది.

 Pk Team Member Has Tdp Strategist Telugudesham, I Pack Chandrababu Naidu, Prash-TeluguStop.com

దీనికోసం ప్రత్యేకంగా కొన్ని టీమ్ లు పనిచేస్తుండడం, వారి వ్యూహాలతో రాజకీయ పార్టీలు అధికారం దక్కించుకోవడంతో ఈ తరహా విధానానికి అన్ని రాజకీయ పార్టీలు అలవాటు పడుతున్నాయి.ఏపీ విషయానికి వస్తే వైసిపి ప్రతిపక్షంలో ఉండగా, అధికార పార్టీ పై పోరాటం చేసేందుకు ప్రజలలో మంచి గుర్తింపు తెచ్చుకుని ఎన్నికల్లో గెలిచేందుకు వీలుగా ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే టీమ్ ను వైసీపీ ఏర్పాటు చేసుకుంది.

పీకే టీమ్ రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ వైసిపి ఎన్నికల్లో విజయం సాధించింది.దీంతో ప్రశాంత్ కిషోర్ టీమ్ పై రాజకీయ పార్టీలకు ఆసక్తి పెరిగింది.

తమిళనాడు, ఢిల్లీ ఇలా అనేక రాష్ట్రాల్లో ప్రశాంత్ కిషోర్ సేవలు అందిస్తున్నారు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ‘ఐ ప్యాక్’ టీమ్ లో విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.

ఆ టీమ్ లో ఇప్పటి వరకు యాక్టివ్ గా వ్యవహరించిన ఉత్తరప్రదేశ్ కు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పుడు ఆ వ్యక్తే తెలుగుదేశం పార్టీ రాజకీయ వ్యూహకర్తగా సేవలందించేందుకు సిద్ధమైనట్లు సమాచారం.

Telugu Telugudesham, Ycp-Political

ఈ మేరకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు ఆ వ్యక్తితో మంతనాలు చేసినట్టు సమాచారం.లాక్ డౌన్ ముగిసిన వెంటనే పూర్తిస్థాయిలో సేవలు అందించేందుకు ఆ టీమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే జగన్ పార్టీకి సంబంధించిన అన్ని వ్యవహారాలు అతనికి తెలిసి ఉండడంతో జగన్ పై తాము చేసే పోరాటానికి మరింత ఊపు వస్తుందని తెలుగుదేశం పార్టీ నమ్ముతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube