మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ఉత్సవ కార్యక్రమాలలో భాగంగా భీమవరం పట్టణంలో అల్లూరి కాంస్య విగ్రహాన్ని ప్రధాని మోడీ తో పాటు సీఎం జగన్ ఆవిష్కరించడం తెలిసిందే.ఈ కార్యక్రమంలో మోడీ జగన్ లతోపాటు పార్టీల నాయకులు పాల్గొన్నారు.9 మంది కూర్చోవడం జరిగింది.ఈ సందర్భంగా అల్లూరి పోరాట స్ఫూర్తిని కీర్తిస్తూ జగన్ అద్భుతమైన ప్రసంగం చేశారు.
పోరాట యోధులలో మహా అగ్నికణం అల్లూరి సీతారామరాజు. భావాల పరంగా మరణం లేని ఓ విప్లవవీరుడు.తెలుగుజాతికి, దేశానికి గొప్ప స్ఫూర్తి ప్రధాత.అల్లూరి ఘనతను గుండెల్లో పెట్టుకున్నాం కాబట్టే… ఆయన నడయాడిన గడ్డకు మనందరి ప్రభుత్వం అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టడం జరిగిందని తెలిపారు.
ఇంకా స్వాతంత్ర పోరాటంలో అల్లూరి వహించిన పాత్ర.ఆయన కీర్తి గురించి తనదైన శైలిలో జగన్ ప్రసంగం చేశారు.
ఇక ఇదే కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి కూడా రావడం జరిగింది.వేదికపై కూర్చున్న వారిలో చిరంజీవి కూడా ఒకరు.
కావటం విశేషం.







