టాలీవుడ్ విశ్వ నటుడు కమల్ హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అకర్లేదు.తన నటనతో ఎన్నో సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
కాగా కమలహాసన్ ఇటీవలే విక్రమ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.దాదాపుగా నాలుగేళ్ల తర్వాత విక్రమ్ సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు.
ఈ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాశాడు.ఇక ఈ సినిమాలో విజయ్ సేతుపతి, పహద్ ఫాసిల్ కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు సంగీతం అందించారు.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 400 కోట్ల భారీ వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.
ఇది ఇలా ఉంటే ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న కమలహాసన్ కు తాజాగా ఒక ఊహించని షార్ట్ ఎదురైంది.కమలహాసన్ ఇంటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే ఇప్పటికే ప్రభుత్వం కమలహాసన్ కు నోటీసులు కూడా పంపించింది అని కోవులివుడ్స్ ని వర్గాలలో వార్తలు కోడై కూస్తున్నాయి.
నోటీసులు పంపించినప్పటికీ తన ప్రాంగణంలో కొంత భాగాన్ని స్వాధీనం చేసుకోవడానికి అభ్యర్థించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చెన్నైలో రెండో దశలో మెట్రోను నిర్మిస్తున్నారు.అల్వార్ పేట స్టేషన్ కమలహాసన్ నివాసం నుంచి ఈ మెట్రో ని నిర్మించబోతున్నారు.
ఈ భవనంలో 175 చదరపు అడుగులు స్టేషన్ నిర్మాణం కోసం కావాల్సి ఉంటుంది.ఇందుకోసం ప్రభుత్వం కమలహాసన్ కు నోటీసులు పంపించినట్లు తెలుస్తోంది.







