టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్లలో మెహ్రీన్ పీర్జాదా కూడా ఒకరు.ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను అందుకోవడంలో సక్సెస్ అయ్యాయి.
ఇక ఆమె ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.కాగా ఈ క్రమంలో ఆమె ప్రస్తుతం ఎఫ్3 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు మెహ్రీన్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.ఇటీవల ‘ఏక్ మినీ కథ’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో సంతోష్ శోభన్‌తో కలిసి మెహ్రీన్ ఈ వెబ్ సిరీస్ చేయబోతుంది.
ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్‌ను దర్శకుడు మారుతి తెరకెక్కించనుండటంతో ఈ వెబ్ సిరీస్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.ఇక ఈ వెబ్ సిరీస్‌లో మెహ్రీన్ పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని తెలుస్తోంది.
కాగా ఈ వెబ్ సిరీస్‌కు ఓ ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారట మేకర్స్.ఈ వెబ్ సిరీస్‌కు ‘మంచి రోజులు వచ్చాయి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయగా, అది ఈ కథకు పర్ఫెక్ట్‌గా యాప్ట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు.
కాగా ఈ వెబ్ సిరీస్‌తో పాటు ఇతర ఆఫర్స్‌ను కూడా పరిశీలించే పనిలో అమ్మడు బిజీగా ఉందట.
అయితే ఈ ఏడాది మెహ్రీన్ పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు రాగా, అమ్మడు తన పెళ్లిని వచ్చే ఏడాదికి వాయిదా వేసింది.
మరి థియేటర్ ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయిన మెహ్రీన్, డిజిటల్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నాయి సినీ వర్గాలు.అటు సంతోష్ శోభన్ కూడా ఈ వెబ్ సిరీస్‌తో తన కెరీర్‌కు బూస్ట్ దొరుకుతుందని చాలా ఆసక్తిగా ఉన్నాడు.
మరి మెహ్రీన్, సంతోష్ శోభన్‌లకు ఈ వెబ్ సిరీస్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.