టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ వరుసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు చిరంజీవి.
కాగా ఇటీవలే ఆచార్య, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.ఆచార్య సినిమా విడుదల భారీ డిజస్టర్ గా నిలవగా గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ ను అందుకుని కలెక్షన్ ల వర్షం కురిపిస్తోంది.
ఇది ఇలా ఉంటే ఇటీవల విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాలో.
నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను.
కానీ నా నుంచి రాజకీయం దూరం కాలేదు అని మెగాస్టార్ పవర్ ఫుల్ డైలాగ్ ను చెప్పిన విషయం తెలిసిందే.ఇవే విషయాలు రియల్ లైఫ్ లో కూడా నిజమవుతున్నాయి.
చిరంజీవి ఏ పార్టీ నాయకుడితో మాట్లాడిన చాలు వెంటనే సోషల్ మీడియాలో చిరంజీవి ఆ పార్టీలోకి వెళ్ళబోతున్నారు.ఆ పార్టీకి సీఎంగా ఆఫర్ వచ్చింది అంటూ రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కానీ ఆ వార్తలపై మాత్రం చిరంజీవి స్పందించడం లేదు.ఇలా ఉండి తాజాగా చిరంజీవి దర్శకుడు పూరి జగన్నాథ్ తో మొదటిసారిగా ఇంస్టాగ్రామ్ లైవ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన ప్రశ్నలను పూరి జగన్నాథ్ అడకగా ఓపికతో సమాధానం ఇచ్చారు చిరు.
ఈ నేపథ్యంలోనే.పూరి జగన్నాథ్ చిరంజీవి ప్రశ్నిస్తూ మీకు పాలిటిక్స్ లో ఇష్టమైన లీడర్ ఎవరు? ఈ జనరేషన్ కావచ్చు ఇంతకుముందు జనరేషన్లో అయినా ఏ పొలిటిషన్ అంటే మీకు ఇష్టం అని అడగగా.ఆ విషయం పై స్పందించిన చిరంజీవి ఈ జనరేషన్ అంటే నా దగ్గర ఆన్సర్ లేదు కానీ.
పాత జనరేషన్ అంటే చాలామంది ఉన్నారు.వారందరు రకరకాల పార్టీలలో ఉన్నారు.
నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంతవరకు లాల్ బహదూర్ శాస్త్రి గారు అంటే నాకు చాలా ఇష్టం.ఆయన మహానుభావుడు.ఆయన సింప్లిసిటీ తన జీవితాన్ని దేశ శ్రేయస్సు కోసం అర్పించిన మహానుభావుడు.మహాత్మా గాంధీని ఎలా అయితే అనుకుంటామో అదే విధంగా అదే రోజు పుట్టిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని కూడా గొప్ప రాజకీయుడుగా నేను ఇష్టపడుతూ ఉంటాను అని తెలిపారు చిరంజీవి.
అలాగే రియల్ స్టేట్ మెన్ అటల్ బిహారీ వాజ్ పేయి ని కూడా నేను ఇష్టపడతాను అని తెలిపారు చిరంజీవి.