అవును, మీరు విన్నది నిజమే.ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీ స్విస్ రేకు( Swiss Re ) చెందిన సీనియర్ మేనేజర్.
ఓ మహిళా ఉద్యోగిపట్ల చాలా దురుసుగా, అవమనీయంగా ప్రవర్తించాడు.లింగ వివక్ష చూపుతూ ఆమె రొమ్ముల పరిమాణం గురించి చాలా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసాడు.
అక్కడితో ఆగకుండా సరైన కారణం చెప్పకుండానే ఆమెను విధుల నుండి తొలగించాడు.కాగా మేనేజర్( Manager ) వ్యాఖ్యలతో ఆమె మానసికంగా వేదన అనుభవించారు.
సరైన కారణం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆమె ఆర్థికంగా కూడా నష్టపోవడం జరిగింది.
![Telugu Abusive, Julia, London Tribunal, Rs, Swiss, Latest, Employee-Latest News Telugu Abusive, Julia, London Tribunal, Rs, Swiss, Latest, Employee-Latest News](https://telugustop.com/wp-content/uploads/2023/08/Swiss-Re-faces-13-crores-claim-over-unfair-dismissal-and-abusive-comments-on-women-employee-detailsd.jpg)
దాంతో బాధితురాలు న్యాయం కోసం లండన్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను( London Employment Tribunal ) ఆశ్రయించగా విచారణ జరిపిన ట్రిబ్యునల్ ఆమెకు రూ.13 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని ఇన్సూరెన్స్ కంపెనీకి తెగేసి చెప్పింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.
స్విస్ రే ఇన్సూరెన్స్ కంపెనీ లండన్ బ్రాచ్‌లో 2017లో జూలియా సోమర్( Julia Somer ) అనే మహిళ పొలిటికల్ రిస్క్ అండర్ రైటర్‌గా ఉద్యోగంలో జాయిన్ అయ్యారు.ఈ క్రమంలో 2021లో డెలివరీ కోసం సెలవులు తీసుకుని వచ్చిన తర్వాత ఆమె బాగా లావెక్కారు.
దాంతో ఆమె బరువును గురించి పలుమార్లు కామెంట్ చేసిన సీనియర్ మేనేజర్ ఆఖరికి అర్ధాంతరంగా ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాడు.
![Telugu Abusive, Julia, London Tribunal, Rs, Swiss, Latest, Employee-Latest News Telugu Abusive, Julia, London Tribunal, Rs, Swiss, Latest, Employee-Latest News](https://telugustop.com/wp-content/uploads/2023/08/Swiss-Re-faces-13-crores-claim-over-unfair-dismissal-and-abusive-comments-on-women-employee-detailss.jpg)
దాంతో ఆమె తనకు రావాల్సిన బోనస్‌ను( Bonus ) కూడా కోల్పోవడం జరిగింది.ఈ క్రమంలో బాధితురాలు లండన్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించి తన గోడుని వెళ్లబుచ్చారు.2017లో వర్క్ బ్రేక్‌లో డ్రింక్స్ తీసుకుంటుండగా బాస్ చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి కూడా ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు.వర్క్ డ్రింక్స్ సందర్భంగా తన దగ్గరికి వచ్చిన బాస్ ‘ఇఫ్ ఐ హావ్ బ్రెస్ట్స్ లైక్ యువర్స్, ఐ వుడ్ బి డిమాండింగ్ టూ’ అన్నారని, అంతేగాక ‘ఐ బెట్ యూ లైక్ టు బి టాప్ ఇన్ బెడ్’ అని కూడా వ్యాఖ్యానించారని లండన్ ఎంప్లాయిమెంట్ ట్రిబ్యునల్‌కు సమర్పించిన పిటిషన్లో బాధితురాలు జూలియా సోమర్ పేర్కొనగా ఈ పిటిషన్‌పై విచారణ చేసిన ట్రిబ్యునల్.బాధితురాలికి రూ.13 కోట్ల (1.3 పౌండ్స్) ను నష్టపరిహారంగా చెల్లించాలని ఆదేశించింది.దాంతో వారికి తగిన శాస్తి జరిగింది.