సూపర్ స్టార్ సినిమా అంటే అభిమానులకు పండగే.అలాంటిది ఒకే సినిమా లో ఇద్దరు సూపర్ స్టార్స్ ఉన్నారు అంటే ఏ రేంజ్ లో ఆ సినిమా పై క్రేజ్ పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.
తమిళ్ సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం జైలర్ సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా లో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఒక కీలకమైన పాత్ర లో కనిపించబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.
గత కొన్ని రోజులుగా జైలర్ చిత్రీకరణ కోసం రజనీకాంత్ మరియు చిత్ర యూనిట్ సభ్యులు హైదరాబాద్ లోని ఒక ప్రముఖ స్టూడియో లో ఉన్నారు.నేటి నుండి మోహన్ లాల్ కూడా వారితో జాయిన్ కాబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.
రజనీ కాంత్ మరియు మోహన్ లాల్ కాంబినేషన్ లో పెద్ద ఎత్తున యాక్షన్స్ సన్నివేషాలు ఉంటాయని తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.జైలర్ సినిమా కోసం రజనీకాంత్ అభిమానులతో పాటు తమిళ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
గత కొంత కాలంగా రజినీ కాంత్ ఆశించిన స్థాయిలో సక్సెస్ లను సొంతం చేసుకోలేక పోతున్నాడు.అందుకే జైలర్ సినిమా ను కాస్త ఎక్కువ దృష్టి పెట్టి ఆయన చేశాడనే ప్రచారం జరుగుతుంది.
యాక్షన్స్ సన్నివేశాలు మాత్రమే కాకుండా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కూడా రజనీ కాంత్ జైలర్ సినిమా ఉండాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.ఇప్పుడు మోహన్ లాల్ కూడా సినిమా లో జాయిన్ అవ్వడం వల్ల తమిళ సినీ ప్రేక్షకుల్లో కూడా జైలర్ సినిమా పై అంచనాలు పెరిగే అవకాశం ఉంది.ఇక రజనీ కాంత్ కి తెలుగు రాష్ట్రాల్లో సాధారణంగానే మంచి ఫాలోయింగ్ ఉంటుంది.కనుక ఇక్కడ ఇద్దరు సూపర్ స్టార్ లు కలిసిన నటించిన సినిమా అవడం తో కచ్చితంగా మంచి ఆదరణ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.