లవ్యూ నాన్న.. ఎప్పటికీ నీతోనే ఉంటాను.. కొడుకు గురించి సునీత ఆసక్తికర పోస్ట్!

గాయనిగా, డబ్బింగ్ కళాకారిణిగా సునీత పాపులారిటీని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.గుంటూరు, విజయవాడ నగరాలలో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన సునీత మొదట్లో కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించడంతో పాటు సహాయ దర్శకురాలిగా కూడా పని చేశారు.15 సంవత్సరాలకే సునీత ఇండస్ట్రీలోకి సింగర్ గా ఎంట్రీ ఇచ్చారు.గులాబి, ఎగిరే పావురమా సినిమాలతో సునీత పాపులారిటీని పెంచుకున్నారు.

 Singer Sunitha Say Birthday Wishes To Her Son Akash And Shares Rare Photo Goes V-TeluguStop.com

తెలుగులో సునీత ఎంతోమంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు.500 కంటే ఎక్కువ సినిమాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పని చేసి సునీత పాపులారిటీని పెంచుకున్నారు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో 3,000కు పైగా సునీత పాటలు పాడటం గమనార్హం.19 సంవత్సరాల వయస్సులో కిరణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్న సునీత కొన్ని కారణాల వల్ల భర్తతో విడిపోయారు.ఈ ఏడాది జనవరి నెలలో సునీత రామ్ వీరపనేని వివాహం చేసుకున్నారు.

Telugu Rare, Son Akash, Sunitha-Movie

తాజాగా సునీత కొడుకు పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్ట్ చేయగా పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం.ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న సునీత వ్యక్తిగత విషయాలతో పాటు ఫోటోలను సైతం అభిమానులతో పంచుకుంటున్నారు.సునీత ఫ్రీ టైమ్ లో తన భర్త, కుటుంబ సభ్యులకు సమయం కేటాయిస్తున్నారు.

సునీత తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా హ్యాపీ బర్త్ డే డియర్ అకాష్ అంటూ కొడుకుకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.

Telugu Rare, Son Akash, Sunitha-Movie

తన కొడుకు లైఫ్ లో ఎంచుకున్న ప్రతిదీ మంచి జరగాలని కోరుకుంటున్నానని సునీత చెప్పుకొచ్చారు.లవ్యూ నాన్నా ఎప్పటికీ నీతోనే ఉంటానంటూ సునీత చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.మరోవైపు సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత భారీ స్థాయిలోనే పారితోషికం తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube