ఈ ఏడాది మే నెలలో కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు( Karnataka Assembly Elections ) జరిగిన సంగతి తెలిసిందే.హోరాహోరీగా జరిగిన ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారం కైవసం చేసుకుంది.
ఈ ఎన్నికలలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మంచి పోటీ నెలకొంది.ప్రధాని మోదీ సైతం గతంలో ఎన్నడూ లేని రీతిలో కర్ణాటక రాష్ట్రంలో భారీ ఎత్తున బహిరంగ సభలలో ర్యాలీలలో పాల్గొన్నారు.
అయినా గాని కాంగ్రెస్ పార్టీకే కర్ణాటక ప్రజలు పట్టం కట్టారు.ఇదిలా ఉంటే కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కొడుకు యాతింద్ర సిద్ధరామయ్య( Yathindra Siddaramaiah )… సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రజలకు డబ్బు పిచ్చి పట్టింది అని వ్యాఖ్యానించారు.
తన తండ్రి సిద్ధరామయ్య గెలుపు కోసం భారీగా ఖర్చు చేశారని చెప్పుకొచ్చారు.
కర్ణాటకలో కాంగ్రెస్( Karnataka Congress ) గెలవడానికి చాలా కష్టపడటం జరిగింది.ఈ క్రమంలో అందరిలాగే మా నాన్న కూడా ఓటర్లకు కుక్కర్లు, ఇస్త్రీ పెట్టెలు, గడియారాలు పంచారు.
కానీ ఓటర్లు వస్తువులు వద్దు డబ్బులే కావాలని డిమాండ్ చేశారు.ప్రజలకు డబ్బు పిచ్చి చాలా పట్టింది… ఇచ్చింది తీసుకోరు అంటూ సీరియస్ గా వ్యాఖ్యానించారు.
దీంతో యాతింద్ర సిద్ధరామయ్య వ్యాఖ్యలు కర్ణాటక రాజకీయాలలో సంచలనంగా మారాయి.