ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్బీఐ వినియోగదారులకు షాక్ ఇచ్చింది.అన్ని రుణాలపై వడ్డీ రేట్లు పెంపునకు నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు పెరిగిన వడ్డీ రేట్లు నేటి నుంచి అమల్లోకి వచ్చాయని బ్యాంకు తెలిపింది.
ఎస్బీఐ తాజా నిర్ణయంతో వ్యక్తిగత రుణాలు, వాహన రుణాలతో పాటు గృహ రుణాలు పొందిన వారికి అదనపు భారం పడుతుంది.
కాగా ఎస్బీఐ ఓవర్ నైట్ ఎంసీఎల్ రేటును 10 బీపీఎస్ పాయింట్లు పెంచింది.దీని కారణంగా వడ్డీరేటు 7.85 శాతం నుంచి 7.95 శాతానికి పెంచింది.ఫలితంగా నెలకాల రుణాలపై వడ్డీ రేటు 8.10 శాతానికి పెరిగింది.అదేవిధంగా సంవత్సర కాల వ్యవధిలో రుణాలపై కొత్త రేటు 8.40 శాతం నుంచి 8.50 శాతానికి… రెండేళ్ల కాలానికి 8.50 నుంచి 8.60 శాతానికి పెరిగిందని బ్యాంకు వెల్లడించింది.