సౌత్ స్టార్ హీరోయిన్ లలో సమంత రూత్ ప్రభు ఒకరు.ఈమె స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
అయితే ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగ చైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది.అయితే వీరి బంధం నాలుగేళ్లు కూడా సాగకుండానే విడాకులు తీసుకున్నారు.
ఇక విడాకుల తర్వాత సామ్ మళ్ళీ తన సినీ కెరీర్ కొనసాగిస్తుంది.
ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో పాటు, పుష్ప ఐటెం సాంగ్ తో ఈమె పాన్ ఇండియా వ్యాప్తంగా పాపులర్ అయ్యింది.
ఆ తర్వాత ఈమెకు మరిన్ని అవకాశాలు వరించాయి.బాలీవుడ్ లో కూడా బడా ప్రాజెక్ట్స్ పై సైన్ చేసింది.అయితే వరుస అవకాశాలు అందుకుంటూ వాటిని పూర్తి చేస్తున్న సమయంలోనే ఈమె హెల్త్ ప్రాబ్లెమ్ బారిన పడింది.
మయోసైటిస్ అనే వ్యాధితో ఈమె చాలా రోజుల నుండి పోరాటం చేస్తుంది.అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇప్పుడిప్పుడే మెల్లగా ఈ వ్యాధి నుండి బయట పడుతుంది.తాజాగా సమంత తన ట్రీట్మెంట్ గురించి ఒక అప్డేట్ అందించింది.
తాను ప్రెజెంట్ మయోసైటిస్ చికిత్సలో భాగంగా నెలవారీ సెషన్ ను హాజరయ్యానని ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని చెబుతున్నాడు.
సోషల్ మీడియా వేదికగా ఈమె ఈ అప్డేట్ ఇచ్చింది.కష్టపడాలని.కష్టం అని తెలిసిన విడవకుండా కష్టపడితేనే ఫలితం ఉంటుంది అని ఈమె ఈ పోస్ట్ ద్వారా తెలిపారు.
మొత్తంగా ఈమె ఈ వ్యాధి నుండి కోలుకోవడంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఈమె మరింత త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు.ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే.తెలుగులో సామ్ నటించిన శాకుంతలం మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది.
ఏప్రిల్ 14న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నారు.