బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రోహిణి (Rohini) అనంతరం బిగ్ బాస్ (Bigg Boss) కార్యక్రమంలో సందడి చేశారు.ఇలా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం జబర్దస్త్ (Jabardasth) కార్యక్రమంలో సందడి చేస్తున్నారు.
అదేవిధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా బుల్లితెరపై కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె సినిమాలలో కూడా చిన్న చిన్న పాత్రలలో నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా రోహిణి కొత్త కారు కొన్నారు.ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
![Telugu Rohini, Jabardasth, Rohinikia, Rohini Car, Rowdy Rohini, Tollywood-Movie Telugu Rohini, Jabardasth, Rohinikia, Rohini Car, Rowdy Rohini, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/01/rowdy-rohini-bought-new-luxury-car-price-and-details-detailsd.jpg)
ఈమె కొనుగోలు చేసిన ఈ కారు తనకు మూడో కారని తెలిపారు.మొదటి కారు యాక్సిడెంట్ అయి పూర్తిగా పాడైపోయిందని ఇక తనకున్న రెండో కారు కూడా ఇటీవల అమ్మేసి మూడో కారును కొన్నానని రోహిణి తెలిపారు.తాజాగా ఈమె కియా సెల్టోస్ (Kia Seltos) జీటీఎక్స్ ప్లస్ బ్రాండ్ కి చెందినదని ఈమె తెలియజేశారు.తాను మొదటిసారి కొన్న కారు 9 లక్షల రూపాయలు పెట్టి కొన్నాను రెండో కారును 14 లక్షలు పెట్టి కొనుగోలు చేశానని తెలిపారు.
![Telugu Rohini, Jabardasth, Rohinikia, Rohini Car, Rowdy Rohini, Tollywood-Movie Telugu Rohini, Jabardasth, Rohinikia, Rohini Car, Rowdy Rohini, Tollywood-Movie](https://telugustop.com/wp-content/uploads/2024/01/rowdy-rohini-bought-new-luxury-car-price-and-details-detailsa.jpg)
ఇక ముచ్చటగా మూడోసారి కొనుగోలు చేసిన ఈ కారు కోసం తాను 25 లక్షల రూపాయలు ఖర్చు చేశానని ఈమె తెలియచేశారు.నిజానికి ఈమె కియా కారు కాకుండా ఆడి కారు( Audi Car ) కొనుగోలు చేయాలని భావించారట కానీ దాని ధర 57 లక్షల రూపాయల వరకు ఉండడంతో అంత మొత్తంలో చెల్లించలేక అలాగే లోన్ పెట్టుకుంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో అనే ఆలోచనతో ఆ కారు కొనుగోలు చేయాలనే ఆలోచన కూడా విరిమించుకున్నానని రోహిణి తెలిపారు.ఇప్పటికే నాకంటూ ఒక కారు ఇల్లు కొనుక్కున్నానని ఇక ఒక ఫ్లాట్ తీసుకుని అమ్మ నాన్నలకు కానుకగా ఇవ్వాలి అదొక్కటే మిగిలి ఉంది అంటూ ఈ సందర్భంగా రోహిణి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.