2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ). అయితే క్రిమినల్, సివిల్ కేసులు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఈ క్రమంలో గత నెలలో కొలరాడో కోర్ట్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరాదని అనర్హత ఓటు వేయడం కలకలం రేపింది.ఊహించని ఈ పరిణామంతో ట్రంప్ షాక్‌కు గురైనప్పటికీ ఆ వెంటనే తేరుకుని పై కోర్టును ఆశ్రయించారు.
దీనిపై స్పందించిన యూఎస్ సుప్రీంకోర్టు( US Supreme Court ). కొలరాడో అధ్యక్ష ఎన్నికల బ్యాలెట్ నుంచి ట్రంప్‌ను నిషేధించవచ్చో లేదో పరిశీలించడానికి అంగీకరించింది.ఫిబ్రవరి 8న ఈ కేసులో వాదనలు వింటామని న్యాయమూర్తులు తెలిపారు.

2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన డొనాల్డ్ ట్రంప్.కొత్తగా ఎన్నికైన డెమొక్రాట్ ప్రభుత్వానికి( Democrat Government ) వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా వ్యవహరించారని న్యాయస్థానం తేల్చింది.ఈ నేరానికి గాను అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ సెక్షన్ 3వ నిబంధన ప్రకారం ట్రంప్.
రాజ్యాంగ పదవులకు అనర్హుడని ఏడుగురు సభ్యులతో కూడిన కొలరాడో సుప్రీంకోర్ట్ 4 – 3 మెజారిటీతో తీర్పును వెలువరించింది.రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిని నిర్ణయించే ప్రక్రియలో భాగంగా నిర్వహించే కొలరాడో స్టేట్ ప్రైమరీ బ్యాలెట్ ఎన్నికల్లో ఆయన పేరును చేర్చరాదని ధర్మాసనం వెల్లడించింది.

అలాగే యూఎస్ క్యాపిటల్( US Capitol Attack )పై జరిగిన తిరుగుబాటు , అలర్ల ఘటనకు సంబంధించి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రపై యూఎస్ క్యాపిటల్ పోలీస్ అధికారుల బృందం వేసిన దావాలో విజయం సాధించారు.సివిల్ వ్యాజ్యాల నుంచి తనకు సంపూర్ణ ఇమ్యూనిటీ వుందన్న ట్రంప్ వాదనను తిరస్కరిస్తూ వారి దావా కొనసాగవచ్చని ఫెడరల్ అప్పీల్ కోర్ట్ తీర్పు వెలువరించింది.క్యాపిటల్‌పై దాడి చేసి అధికారులను గాయపరిచిన హింసాత్మక గుంపును ట్రంప్ ప్రేరేపించారని దావా ఆరోపించింది.డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ కోసం యూఎస్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఈ నెల ప్రారంభంలో తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఈ తీర్పు వెలువరించింది.







