మేడ్చల్ జిల్లా అత్వెల్లిలో రోడ్డుప్రమాదం సంభవించింది.తెలంగాణ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.
ప్రమాదం జరిగిన సమయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి కారులోనే ఉన్నారని సమాచారం.కాగా మృతుడు మేడ్చల్ కు చెందిన నర్సింహులుగా గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం కారును అక్కడి నుంచి తరలించారు.
ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.