అమెరికాలో ఇప్పుడు వాళ్ళే అత్యంత కీలకం..!!!

అమెరికాలో నిన్నటి రోజు మొదలు నేటి వరకూ అంటే 24 గంటల వ్యవధిలో 20 వేల కొత్త కేసులు నమోదు అయ్యాయి.అమెరికాలో కరోనా కంట్రోల్ లోకి వచ్చింది అంటూ వ్యాఖ్యానిస్తున్న వారికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి.

 Recovered Coronavirus Patients Test Positive Again , Coronavirus, Test Positive,-TeluguStop.com

మృతుల సంఖ్య కూడా 25 వేలకి చేరుకుంది.ఇదిలాఉంటే ఇప్పుడు అమెరికా వాసులని, అధికారులని కలవరానికి గురిచేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.

చైనాలో కరోనా ధాటికి ఎంతో మంది చనిపోయారు.కానీ అక్కడి వైద్యులు ఈ వ్యాధి బారినుంచీ వేలాది మందిని రక్షించగలిగారు.రోగులు పూర్తిగా కోలుకున్నారు అనుకున్న తరువాత ఇంటికి పంపేశారు.కానీ సరిగ్గా 8 రోజుల తరువాత మళ్ళీ వారిలో కరోనా లక్షణాలు కనిపించడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించి అందరిని అలెర్ట్ చేశారు.

మొత్తానికి మళ్ళీ కరోనా రాకుండా కట్టడి చేశారు.ఇదిలాఉంటే.

Telugu America, Coronavirus, Trump-

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సైతం ఈ వ్యాధిని కట్టడి చేసేందుకు 30 రోజుల ప్రణాళిక సిద్దం చేశారు.ట్రంప్ ప్రణాళికతో వైరస్ తగ్గిపోతుందని అంతా అనుకుంటున్న సమయంలో కరోనా నుంచీ కోలుకున్న అమెరికన్స్ లో కొంతమందికి మళ్ళీ పాజిటివ్ రావడం ప్రస్తుతం అమెరికన్స్ ని ఆందోళనలోకి నెట్టేస్తోంది.ప్రస్తుత పరిస్థితులలో కరోనా నుంచీ కోలుకున్న వారే అమెరికాలో అత్యంత కీలకమని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అంటున్నారు నిపుణులు…కాగా వారికి రోగనిరోధక శక్తి అధికంగా ఉందని అలాంటి పరిస్థితులు జరిగే అవకాశాలు అత్యంత తక్కువని అంటున్నారు వైద్య నిపుణులు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube