కళ్యాణ్ రామ్ ప్రయోగాలు అందుకే ఫెయిల్ అవుతున్నాయా.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలలో ఎక్కువగా నటించే హీరోగా కళ్యాణ్ రామ్ కు పేరు ఉండగా కళ్యాణ్ రామ్ సైతం భిన్నమైన కథలను ఎంచుకుంటున్నారు.అయితే బింబిసారతో బ్లాక్ బస్టర్ సాధించిన కళ్యాణ్ రామ్ కు అమిగోస్ ఫలితం షాకిచ్చింది.

 Reasons Behind Kalyan Ram Movies Faiilure Details Here Goes Viral ,kalyan Ram ,-TeluguStop.com

అమిగోస్ సినిమాకు క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలు వచ్చాయి.కనీసం 3 రేటింగ్ కూడా రాకపోవడంతో అభిమానులు ఒకింత ఫీలవుతున్నారు.

అయితే కళ్యాణ్ రామ్ ప్రయోగాత్మక కథలలో నటిస్తున్నా చిన్నచిన్న తప్పుల వల్లే ఆయన సినిమాలు ఫ్లాపవుతున్నాయి.అమిగోస్ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో గూస్ బంప్స్ వచ్చే సన్నివేశాలు అస్సలు అస్సలు లేవు.

సినిమాలో చాలా సమయాన్ని దర్శకుడు రొటీన్ సన్నివేశాలతో చూపించడం అభిమానులకు ఒకింత నిరాశ నిరాశ కలిస్తుందని చెప్పవచ్చు.కొత్త దర్శకుడు కాబట్టే ఈ సినిమాను సరిగ్గా హ్యాండిల్ చేయలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Telugu Amigos, Bimbisara, Kalyan Ram, Kalyanram, Tollywood-Movie

ప్రస్తుత పరిస్థితుల్లో కళ్యాణ్ రామ్ వరుసగా కొత్త దర్శకులకు ఛాన్సివ్వడం కరెక్ట్ కాదు.ఈ రీజన్ వల్లే కళ్యాణ్ రామ్ కు వరుస సక్సెస్ లు దక్కడం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.ప్రయోగాత్మక సినిమాలను ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడరు.మరీ అద్భుతమైన కాన్సెప్ట్ తో తెరకెక్కితే మాత్రమే ఈ తరహా సినిమాలను ప్రేక్షకులు ఇష్టపడతారు.కళ్యాణ్ రామ్ రేంజ్ పెరగాలంటే ఈ విధంగా చేయాలి.

Telugu Amigos, Bimbisara, Kalyan Ram, Kalyanram, Tollywood-Movie

వరుసగా సినిమాలు ఫ్లాప్ అయితే ఆ ప్రభావం కళ్యాణ్ రామ్ మార్కెట్ పై కూడా పడుతుంది.క్రేజ్ ఉన్న దర్శకులను ఎంచుకుంటే మాత్రమే కళ్యాణ్ రామ్ స్థాయి మారిపోతుందని చెప్పవచ్చు.కళ్యాణ్ రామ్ ఈ విషయానికి సంబంధించి ఇకనైనా మారతారో లేదో చూడాల్సి ఉంది.

కళ్యాణ్ రామ్ మంచి దర్శకులను ఎంచుకుని మాస్ మసాలా సినిమాలలో నటిస్తే బాగుంటుందని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube