టీమ్ ఇండియా ఆటగాడు ఆర్.అశ్విన్ ఖాతలో మరొక రికార్డ్ నమోదు అయిందనే చెప్పాలి.
కాన్పూర్ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆట ముగిసేసరికి ఇండియా ఖాతాలో కేవలం ఒకే ఒక వికెట్ ఉండగా, టీమిండియా సీనియర్ స్పిన్నర్ ఆర్.అశ్విన్ విల్ యంగ్ ని ఎల్‌బీడబ్ల్యూగా అవుట్ చేశాడు.అయితే ఈ వికెట్ తీయడంతో ఆర్ అశ్విన్ ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడనే చెప్పాలి.అలాగే ఈ టెస్టు క్రికెట్ మ్యాచ్ లో మొత్తం 417 వికెట్లు తీసిన బౌలర్‌గా కూడా అశ్విన్ నిలిచాడు.
అయితే ఇప్పటిదాకా ఈ టెస్టు క్రికెట్‌లో 417 వికెట్లు తీసిన రికార్డు హర్భజన్ సింగ్ పేరిట మాత్రమే ఉంది.
ఇప్పుడు టెస్ట్ క్రికెట్ లో భారతదేశం తరపున 417 వికెట్లతో, ఆర్.అశ్విన్ అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా హర్భజన్ సింగ్‌తో సమానంగా అయితే ఈ టెస్ట్‌లో ఇంకా ఒక రోజు మిగిలి ఉంది.అశ్విన్ ఒకే ఒక్క వికెట్ తీస్తే చాలు హర్భజన్ సింగ్‌ను దాటి ముందు ప్లేస్ లో ఉంటాడు.
ఇప్పటిదాకా ఇండియా నుంచి టెస్టు మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్లలో 132 మ్యాచ్‌లలో 619 వికెట్లు తీసిన అనిల్ కుంబ్లే మొదటి స్థానంలో ఉండగా,అలాగే 131 మ్యాచ్‌లలో 434 వికెట్లు తీసి కపిల్ దేవ్ రెండో స్థానంలో ఉన్నాడు.

అయితే ఇప్పుడు అశ్విన్ కేవలం 80 టెస్టు మ్యాచ్‌ల్లో 417 వికెట్లు పడగొట్టాడు.కాగా హర్భజన్ సింగ్ 103 టెస్టు మ్యాచ్‌ల్లో 417 వికెట్లు పడగొట్టాడు.అలాగే వీరి ఇద్దరి తరువాత ఇషాంత్ శర్మ 105 మ్యాచ్‌లలో 311 వికెట్లు తీసి తరువాత స్థానంలో నిలిచాడు.
అలాగే అశ్విన్ ఖాతాలో మరొక రికార్డ్ కూడా ఈ సంవత్సరంలో నమోదు అయింది.అది ఏంటంటే 2021 సంవత్సరానికి గాను అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు.