రవితేజ హీరో గా డింపుల్ హయాతి మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్ లుగా నటించిన ఖిలాడి సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రమేష్ వర్మ దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా కు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.
సినిమా విడుదలకు ముందే అంచనాలు భారీగా పెరిగాయి.ట్రైలర్ విడుదల తర్వాత సినిమా పై మరింత ఆసక్తి కనిపించింది.
చాలా రోజుల తర్వాత థియేటర్లలోకి పెద్ద సినిమా వస్తున్న నేపథ్యం లో అభిమానులు థియేటర్ల వద్ద బారులు తీరుతారు అని ఇండస్ట్రీకి చెందిన ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూశారు.ఇక ఏపీ లో ఉన్న టికెట్ల రేట్లు విషయమై ఓ క్లారిటీ రావడం తో ఖిలాడి కి కలిసి వస్తుందని అంతా భావించారు.
కానీ నిన్న చిరంజీవి ఆధ్వర్యంలో మహేష్ బాబు, ప్రభాస్ ఇంకా రాజమౌళి, కొరటాల శివ లు సీఎం జగన్ మోహన్ రెడ్డి తో భేటీ అయినా టికెట్ల రేట్లను పెంచుతూ కొత్త జీవో తీసుకు రావడానికి మరికొన్ని రోజులు పట్టే సమయం అంటూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త జీవో వచ్చే వరకు ఏపీ లో టికెట్ల రేట్లు పాతవే ఉంటాయి.కనుక ఖిలాడి కి అక్కడ తక్కువ వసూళ్లు నమోదు అవుతాయి అని టాక్ వినిపిస్తుంది.ఇప్పుడు కాకుండా మరో వారం లేదా రెండు వారాల తర్వాత విడుదల చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
వారం పది రోజుల్లో కచ్చితంగా ఏపీ ప్రభుత్వం టికెట్ల రేట్లను పెంచుతూ జీవో విడుదల చేసే అవకాశం ఉంది.కనుక అప్పుడు ఖిలాడి వచ్చి ఉంటే లాభాలు ఎక్కువ వచ్చేవి.
రవితేజ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకుంటుంది అని అంటున్నారు.మరి కాసేపట్లో సినిమా కు సంబంధించిన పూర్తి రివ్యూలు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఇప్పుడు రివ్యూ లు ఎంత పాజిటివ్ గా వచ్చినా కూడా ఏపీలో కలెక్షన్స్ నార్మల్గానే ఉంటాయని టాక్ వినిపిస్తుంది.