టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి రాశీఖన్నా.ఈ అమ్మడు తెలుగులో వరుస సినిమాలతో యంగ్ హీరోలందరితో జత కట్టింది.ఇప్పుడు ఈ భామ కోలీవుడ్ పై ఫోకస్ పెట్టింది.అక్కడ స్టార్ హీరో సూర్య సినిమాతో పాటు మరికొన్ని సినిమాలకి కమిట్ అయ్యింది.వచ్చే ఏడాది మొత్తం రాశీఖన్నా నుంచి తమిళ్ సినిమాలే వస్తాయి.ఇదిలా ఉంటే ఈ అమ్మడు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది.తాజాగా ఆమె పుట్టినరోజు జరుపుకొని ౩౦ ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా తన క్రష్ గురించి చెప్పడంతో డేటింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలని పంచుకుంది.

స్కూల్ చదివే రోజుల్లో తనకన్నా సీనియర్ అబ్బాయిని ఇష్టపడ్డానని, అయితే ఏవో కారణాల వలన ఇద్దరికి అప్పుడే బ్రేక్ అప్ అయిపోయిందని చెప్పింది.ఆ తరువాత ఇప్పటి వరకు ఎవరితో ప్రేమలో పడలేదని, ఆ అవకాశం కూడా తనకి రాలేదని చెప్పుకొచ్చింది.ప్రస్తుతానికి తాను సింగిల్ గానే ఉన్నానని అయితే ఎవరితో అయినా డేటింగ్ చేయాలని కోరిక ఉందని, ఆ అనుభూతిని ఆశ్వాదించాలని ఉంది.
అయితే ప్రేమించాలనే ఆలోచనలు రావడం లేదు.అయితే కచ్చితంగా జీవితంలో ఎవరినైనా ప్రేమించే పెళ్లి చేసుకుంటా అని ఈ రాశీఖన్నా తన స్వీయ అభిప్రాయాలు, అనుభవాలు పంచుకుంది.
మరి డేటింగ్ చేయాలనే ఈమె ఆలోచనకి సౌత్ లో ఎ హీరో అయినా సహకరిస్తాడో లేదో అనేది వేచి చూడాలి.
.