అరటి పండును వీటితో కలిపి తింటే చాలా డేంజర్.. తెలుసా?

ఏడాది పొడవునా అందుబాటులో ఉండే పండ్లలో అరటిపండు ముందు వరుసలో ఉంటుంది.చౌక ధరకే లభించిన కూడా అరటి పండ్లు( Bananas ) ఎన్నో విలువైన పోషకాలను కలిగి ఉంటాయి.

 It Was Very Dangerous To Eat Bananas Along With These Foods! Banana, Banana Heal-TeluguStop.com

విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబ‌ర్‌, ప్రోటీన్‌, యాంటీ ఆక్సిడెంట్లు రిచ్ గా ఉంటాయి.అందువల్ల రోజువారీ ఆహారంలో అరటిపండును చేర్చుకుంటే అపారమైన ఆరోగ్యం ప్రయోజనాలు లభిస్తాయి.

అలాగే అనేక రోగాలకు నివారిణిగా అరటిపండు పనిచేస్తుంది.

అయితే అరటి పండు ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ దాన్ని తీసుకునే విధానంలో చేసే కొన్ని కొన్ని పొరపాట్ల కారణంగా మనకు అది హాని కలిగిస్తుంది.

ముఖ్యంగా అరటి పండును ఇప్పుడు చెప్పబోయే ఆహారాలతో కలిపి తింటే చాలా డేంజర్ అని నిపుణులు చెబుతున్నారు.పోషకాలకు పవర్ హౌస్ లాంటి అరటి పండును పాలతో కలిపి ఎప్పుడు తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఎందుకంటే ఈ రెండింటి కలయిక వల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది.గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

Telugu Banana, Banana Benefits, Banana Effects, Tips, Latest-Telugu Health

అలాగే సిట్రస్ ఫ్రూట్స్ తో కలిపి అరటి పండును కలిపి తీసుకోకూడదు.అరటి పండ్లను నిమ్మ, నారింజ, ద్రాక్ష( Lemon, orange, grape ) వంటి సిట్రస్ పండ్లతో కలపడం వల్ల కొంత మందికి అజీర్ణం లేదా అసౌకర్యం కలగవచ్చు.ఎందుకంటే అరటిపండ్లు మరియు సిట్రస్ పండ్లు రెండూ ఆమ్ల పోషకాలను కలిగి ఉంటాయి.మరియు ఈ కలయిక కడుపుపై కఠినంగా ఉంటుంది.

Telugu Banana, Banana Benefits, Banana Effects, Tips, Latest-Telugu Health

అరటి పండ్లు, స్వీట్లు ఒకేసారి లేదా కలిపి తీసుకుంటే చాలా ప్రమాదకరం.వీటి కలయిక వల్ల బరువు పెరుగుతారు.మరియు రక్తంలో చక్కెర స్థాయిలు సైతం అదుపు తప్పుతాయి.ఇక మాంసం మరియు గుడ్లు వంటి అధిక ప్రోటీన్ ఉండే ఆహారాన్ని తిన్న వెంటనే కూడా అరటి పండ్లను తీసుకోకూడదు.

ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ పై అధిక ప్రభావం పడుతుంది.జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube