ప్రముఖ జ్యోతిష్కులలో ఒకరైన వేణుస్వామి( Venu Swamy ) తనపై ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చినా పట్టించుకోకుండా విజయవంతంగా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.తాజాగా వేణుస్వామి చరణ్ ఉపాసన కూతురు( Ram Charan Upasana Daughter ) జాతకం గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి.
అయితే అప్పుడే పుట్టిన ఊహ తెలియని చిన్నారి జాతకాన్ని వేణుస్వామి వీడియో ద్వారా వెల్లడించడంపై కొంతమంది విమర్శలు చేశారు.
రాధా మనోహర్ దాస్( Radha Manohar Das ) అనే స్వామీజీ వేణుస్వామి గురించి మాట్లాడుతూ ఈ పైత్యం ప్రతిదానిపై చూపించకూడదని అన్నారు.
పసిపిల్ల పుట్టిందంటే సంతోషించాలని ఆయన చెప్పుకొచ్చారు.రామ్ చరణ్ ఒక ఊరిలో శివునికి సేవ చేస్తారని ఆ శివ సేవా ఫలం వల్ల వాళ్లింట్లో అమ్మవారే జన్మించారని నేను భావిస్తున్నానని ఆయన కామెంట్లు చేశారు.
చిరంజీవి కుటుంబ సభ్యులు సైతం ఇంటికి అమ్మవారు వచ్చారనే భావిస్తారని జ్యోతిష్కుడు వెల్లడించారు.
![Telugu Astrologervenu, Princess, Ram Charan, Ramcharan, Swamiji, Upasana-Movie Telugu Astrologervenu, Princess, Ram Charan, Ramcharan, Swamiji, Upasana-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/06/radha-manohar-das-fire-on-venuswamy-detailss.jpg)
పెళ్లైన పదేళ్ల తర్వాత ఆ ఇంటికి అమ్మవారు వచ్చారని ఆ చిన్నారి జాతకం చిన్నారి కుటుంబ సభ్యులకు వేణుస్వామి చెబితే సరిపోతుందని ఆయన కామెంట్లు చేశారు.అలా జాతకం బయటకు చెప్పకూడదని సెలబ్రిటీల పిల్లలు కాబట్టి ఆ ఇంగితం అనేది లేకుండా కొంతమంది జ్యోతిష్కులు ప్రవర్తిస్తారని రాధా మనోహర్ దాస్ వెల్లడించారు.చేసే వృత్తిని బట్టి కులం ఉంటుందని ఆరాధనను బట్టి మతం ఉంటుందని ఆయన తెలిపారు.
![Telugu Astrologervenu, Princess, Ram Charan, Ramcharan, Swamiji, Upasana-Movie Telugu Astrologervenu, Princess, Ram Charan, Ramcharan, Swamiji, Upasana-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/06/radha-manohar-das-fire-on-venuswamy-detailsa.jpg)
వేణుస్వామి ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.వేణుస్వామి సెలబ్రిటీల పేర్లు చెప్పకుండా వాళ్ల జాతకాలలో భవిష్యత్తులో జరిగేది ఇదేనంటూ కామెంట్లు చేస్తున్నారు.వేణుస్వామి చెప్పిన విషయాలలో చాలా విషయాలు నిజం కాలేదని కొంతమంది చెబుతున్నారు.మరోవైపు మెగా ప్రిన్సెస్ కు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిన్నారికి ఏమని పేరు పెడతారో చూడాల్సి ఉంది.