నెట్టింట్లో వైరల్ అవుతున్న పీవీ సింధు డ్యాన్స్ వీడియో..?

ఎప్పుడు స్పోర్ట్స్ డ్రెస్ ధరించి బ్యాట్ చేతిలో పట్టుకొని ఉండే పి.వి.

 Pv Sindhu Dance Video Going Viral On Social Media, Pv Sindu, Dance Video, Viral,-TeluguStop.com

సింధు తాజాగా సంప్రదాయ దుస్తులలో లెహంగా ధరించి అద్భుతమైన డాన్స్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు.ఈ క్రమంలోని పి.

వి.సింధు తను చేసిన డాన్స్ కి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సోమవారం పీవీ సింధు భారతదేశపు మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డులు అందుకుంది.ఈ క్రమంలోనే ఈమె రాష్ట్రపతి భవన్ లోఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేంద్ర మంత్రులు అమిత్ షా సమక్షంలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా అత్యున్నతమైన పురస్కారాన్ని అందుకుంది.

ఇలా పురస్కారాన్ని పొందిన పివి సింధు ఆకుపచ్చ రంగు లెహంగా ధరించి ‘లవ్’ అనే వైరల్ పాటకు డాన్స్ చేస్తూ ఆ వీడియోలు ఇన్స్టాల్ లో పోస్ట్ చేసింది.

Telugu Dance, Pv Sindu-Movie

ప్రస్తుతం ఈమె డాన్స్ కు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.అదే విధంగా పలువురు అభిమానులు ఈమెకు పద్మభూషణ్ అవార్డు అందుకున్నందుకు గాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇకపోతే పీవీ సింధు రెండు సార్లు ఒలింపిక్స్ క్రీడల్లో భాగంగా రజితం, కాంస్య పతకాలను సాధించిన సంగతి అందరికి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube