ప్రొడ్యూసర్ గిల్డ్ తీరుపై తెలుగు సినీ నిర్మాత నట్టికుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.సినీ పరిశ్రమలో ఒక్కటే కమిటీ ఉండాలన్న ఆయన గిల్డ్ ను తీసివేయాలని డిమాండ్ చేశారు.
గిల్డ్ సభ్యులు కౌన్సిల్ లో ఉంటే అందరం సపోర్ట్ చేస్తామని నిర్మాత నట్టికుమార్ తెలిపారు.గిల్డ్ సభ్యులు డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు.
చిన్న నిర్మాతలు గిల్డ్ వాళ్లకు ఓటు వేయొద్దని పేర్కొన్నారు.కౌన్సిల్ లో ఎవరు గెలిచినా అందరికీ మెడీక్లైమ్ ఇవ్వాలన్నారు.
తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సినీ పరిశ్రమను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొందరు వెళ్లి వాళ్ల సమస్యలను మంత్రి తలసానికి చెబుతారన్న ఆయన ఆ సమస్యలే పరిష్కారం అవుతాయని వెల్లడించారు.
పోసాని, అలీ సినీ పరిశ్రమ గురించి ఏపీ ప్రభుత్వంతో ఏం మాట్లాడారో తెలియదని చెప్పారు.చిన్న నిర్మాతల బాధలను ఎవరూ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.
కౌన్సిల్ ఎలక్షన్స్ లో గిల్డ్ సభ్యులు గెలిస్తే మెడికల్ క్రైమ్ ఇవ్వరని స్పష్టం చేశారు.