ఏఐసీసీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ( Priyanka Gandhi) ఈనెల 30వ తారీకు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నారు.కొల్లాపూర్ లో జరిగే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
ఈ సభలోనే మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు( Jupally Krishna Rao ) మరి కొంతమంది నాయకులు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.ఈ సభలో ప్రియాంక గాంధీ నాలుగు డిక్లరేషన్ లు ప్రకటించే అవకాశం ఉందని తెలంగాణ కాంగ్రెస్ నేతలు తెలియజేస్తున్నారు.
ఇదే సమయంలో మహిళా డిక్లరేషన్ ను ప్రకటించే అవకాశం కూడా ఉందని కాంగ్రెస్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించడంతో త్వరలో జరగబోయే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస్ చాలా సీరియస్ గా తీసుకోవడం జరిగింది.
ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలు వరుస పెట్టి తెలంగాణలో పర్యటిస్తూ ఉన్నారు.మొన్ననే రాహుల్ గాంధీ( Rahul Gandhi ) రావడం జరిగింది.అంతకుముందు కర్ణాటక ఎన్నికలు జరిగిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన యువజన సభకు ప్రియాంక గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఇప్పుడు మరోసారి ప్రియాంక గాంధీ వస్తూ ఉండటంతో కొల్లాపూర్ లో జరిగే సభ విజయవంతం చేయడానికి టీ.కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నారు.