భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో విశాఖ తూర్పు మరియు భీమిలి నియోజకవర్గ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది.బీజేపీ విశాఖపట్నం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు రవీంద్ర మేడపాటి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా రాజ్యసభ సభ్యులు GVL నరసింహారావు విచ్చేసారు.
ఈ సందర్భంగా GVL నరసింహా రావు మాట్లాడుతూ ఆయా నియోజకవర్గాల్లోని స్థానిక సమస్యలు మరియు రాజకీయ వాతావరణం గురించి అక్కడి నాయకులను అడిగి తెలుసుకొని వారితో చర్చించి రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి చేయవలసిన కార్యాచరణ గురించి వివరించారు.అలాగే కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి మరియు విశాఖపట్నం నగరానికి చేసే అభివృద్ధి మరియు కేటాయింపుల గురించి తెలుపుతూ కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రజల వద్దకు చేరవేసే విధంగా కార్యకర్తలకు దిశానిర్దేశం చేసారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ VSN కొప్పిశెట్టి, NVS దిలీప్ వర్మ, బీజేపీ రాష్ట్ర RTI సెల్ కన్వీనర్ వెంగమాంబ శ్రీనివాస్ బాబు, జిల్లా ఉపాధ్యక్షులు K సుబ్రహ్మణ్యం, బీజేపీ భీమిలి నియోజకవర్గ కోఆర్డినేటర్ కంటుభుక్త రామానాయుడు మరియు బీజేపీ నాయకులూ కార్యకర్తలు పాల్గొన్నారు.