పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈమధ్యనే మరో రీమేక్ కు ఓకే చెప్పిన విషయం తెలిసిందే.సముద్రఖని డైరక్షన్ లో వచ్చిన తమిళ సినిమా వినోదయ సీతం సినిమా తెలుగు రీమేక్ లో పవన్ నటించబోతున్నారు.
ఈ సినిమాలో పవన్ తో పాటుగా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ తన నెక్స్ట్ సినిమా కోసం కొద్దిగా గ్యాప్ తీసుకున్నాడు.
ఆల్రెడీ సుకుమార్ అసిస్టెంట్ కార్తిక్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న సాయి ధరం తేజ్ లేటెస్ట్ గా పవన్ తో కూడా సినిమాకు రెడీ అవుతున్నాడు.
ఈ తెలుగు రీమేక్ కు మాత్రుక దర్శకుడు సముద్రఖని డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది.
ఈ సినిమాలో సాయి ధరం తేజ్ తో హాట్ బ్యూటీ కెతిక శర్మ నటించబోతుందని తెలుస్తుంది.ఆకాష్ పూరీ రొమాంటిక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కెతిక శర్మ నాగ శౌర్యతో లక్ష్య సినిమాలో కూడా నటించింది.
ప్రస్తుతం వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న రంగ రంగ వైభవంగా సినిమాలో ఆమె నటిస్తుంది.ఈ సినిమాతో పాటుగా సాయి ధరం తేజ్, పవన్ సినిమాలో కూడా ఛాన్స్ దక్కించుకుందని తెలుస్తుంది.







