టీడీపీ జనసేన పొత్తు ఖరారు.. ఏపీలో 2024 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కానుందా?

చంద్రబాబు అరెస్ట్( Chandrababu arrest ) తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.టీడీపీ జనసేన పొత్తు గురించి గత కొంతకాలంగా ఎనో ప్రశ్నలు ఎదురవుతుండగా ఆ ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరికేసింది.

2024 ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటన చేశారు.పవన్ ప్రకటనతో ఏపీలో 2024 ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కానుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీ జనసేన పొత్తు ఖరారైన నేపథ్యంలో వైసీపీ ఏ విధంగా ముందడుగులు వేస్తుందనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.అదే సమయంలో జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే ప్రశ్నకు సైతం జవాబు దొరకాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ తాజాగా తీసుకున్న నిర్ణయం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.అదే సమయంలో మరికొన్ని ప్రశ్నలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Advertisement

టీడీపీ జనసేన పొత్తుకు బీజేపీ( BJP ) అంగీకరించని పక్షంలో పవన్ బీజేపీకి దూరమవుతారా? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది.టీడీపీ జనసేన ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరు సీఎం అవుతారనే ప్రశ్న సైతం వ్యక్తమవుతోంది.చెరో రెండున్నరేళ్లు చంద్రబాబు, పవన్ సీఎంగా ఉంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తుండగా టీడీపీ ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తుందో లేదో చూడాలి.

ఏపీలో ఎన్నికలకు ఆరు నెలల సమయం మాత్రమే ఉండగా పవన్ కళ్యాణ్ ఒక్క మాటతో లెక్కలు మార్చేశారు.ఏయే నియోజకవర్గాల నుంచి జనసేన పోటీ చేస్తుందనే ప్రశ్నకు మరికొన్ని రోజుల్లో సమాధానం దొరకనుంది.జనసేన టీడీపీ పొత్తు విషయంలో ప్రజల నుంచి, రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) జనసేన పార్టీ ఇతర పార్టీలతో పొత్తు లేకుండా పోటీ చేసి ఉంటే బాగుండేదని మరి కొందరు భావిస్తున్నారు.2024 ఎన్నికల్లో ఏపీలో 2014 ఫలితాలే రిపీట్ అవుతాయో లేదో తెలియాలంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

Advertisement

తాజా వార్తలు