వీడియో : వచ్చేసిన లాల భీమ్లా.. మాస్‌ కాదు ఊర మాస్‌

పవన్ కళ్యాణ్‌ హీరోగా నిత్యా మీనన్ హీరోయిన్ గా సాగర్ చంద్ర దర్శకత్వం లో రూపొందుతున్న భీమ్లా నాయక్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.జనవరిలో విడుదల కాబోతున్న ఈ సినిమా నుండి మరో పాటను చిత్ర యూనిట్‌ సభ్యులు విడుదల చేయడం జరిగింది.

 Pawan Kalyan Bheemla Nayak Song Laala Bheemla Out , Bheemla Nayak, Flim News , L-TeluguStop.com

భారీ ఎత్తున అంచనాలున్న ఈ పాటకు థమన్ సంగీతాన్ని అందించాడు.త్రివిక్రమ్ సాహిత్యం అందించిన ఈ పాటను ఆయన పుట్టిన రోజు సందర్బంగా నేడు విడుదల చేయడం జరిగింది.

ప్రముఖ స్టార్స్‌ నటించిన సినిమా అవ్వడంతో భీమ్లా నాయక్ పై అంచనాలు మొదటి నుండి భారీగా ఉన్నాయి.ఆ అంచనాలు మరింతగా పెంచేలా థమన్ పాట పాటను కూడా చాలా బాగా ట్యూన్ చేశాడు అంటున్నారు.

ఈ పాటను కూడా అభిమానులు ఊగిపోయే రేంజ్ లో అందించాడు అంటున్నారు.

పవన్ కళ్యాణ్‌ ఈ సినిమా లో ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడు అనేది ఈ పాట లో చూపించారు.మంచి విజువల్స్ తో యూట్యూబ్‌ లో విడుదల అయిన ఈ పాటలో సింగర్ తో పాటు డాన్సర్స్ ను చూడవచ్చు.వారు సినిమాలో కనిపించరు.

కాని ఈ సినిమా లోని ఆ పాట కోసం ప్రత్యేకంగా వారు వచ్చారు.పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నా ఆర్‌ ఆర్‌ ఆర్ విడుదల కాబోతున్న నేపథ్యంలో వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు కథ.స్క్రీన్‌ ప్లే మరియు మాటలను అందించడం జరిగింది.ఇది రీమేక్ అయినా కూడా కథను చాలా కొత్తగా మలిచారు అంటూ వార్తలు వస్తున్నాయి.తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగానే ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube