పటాస్ కమెడియన్ రాజు లవ్ స్టోరీ తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

తెలుగు బుల్లి తెర మీద ప్రముఖ చానళ్లో ప్రసారమయ్యే పటాస్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ షోకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

 Patas Comedian Yadamma Raju Love Story Details, Yadamma Raju, Patas Comedian Yad-TeluguStop.com

అంతే కాకుండా ఆ చానళ్లో ఈ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది.ఆ షోలో కామెడీ స్కిట్లు వేసే యాదమ్మ రాజు కూడా ఆ షోను ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికీ తెలుసు.

ఈ షో ద్వారా రాజు ఎంతో ఫేమ్ సాధించాడు.ఎంతో మంది అభిమానులు రాజు కామెడీని ఇష్టపడతారు.

అంతలా తన కామెడీతో రాజు అందర్నీ కడుపుబ్బా నవ్విస్తాడు.అంతలా మనల్ని నవ్వించే రాజు జీవితంలో పెద్ద విషాదం ఉంది.

అదే అతని ప్రేమ కథ.యాదమ్మ రాజు ప్రేమకథ గురించి తెలిస్తే మనకు కన్నీళ్లు ఆగవు.అంతలా రాజుకు విషాదంలో మునిగి పోయినా కానీ తన కామెడీతో అందరిలో నవ్వులు పూయిస్తున్నాడంటే అతడు చాలా గ్రేట్ అని ఒప్పుకోక తప్పదు.

ఇంతకీ రాజు లవ్ స్టోరీ ఏంటంటే.

అతడు ఒక అమ్మాయిని ప్రేమించాడట.ఏడాది పాటు చాలా డీప్ లవ్ లో మునిగి తేలిన తర్వాత ఆ అమ్మాయి రాజు వద్దకు వచ్చి నీవంటే నాకు ఇష్టం లేదు అని బ్రేకప్ చెప్పి వెళ్లిపోయినట్లు రాజు ఓ యూ ట్యూబ్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

తన లవ్ స్టోరీ గుర్తుకు వచ్చి ఎన్నో సార్లు బాధపడ్డానని కానీ జీవితంలో విజయం సాధించాలంటే ప్రేమ ఒక్కటే మార్గం కాదని తెలుసుకుని జీవితంలో ముందడుగు వేసినట్లు యాదమ్మ రాజు పేర్కొన్నారు.

Telugu Yadamma Raju, Sharley Stella, Yadammaraju-Movie

అందుకే కామెడీ మీద దృష్టి సారించానని చెప్పుకొచ్చారు.రాజు ప్రస్తుతం అనేక కామెడీ షోలతో పాటు కొన్ని కార్యక్రమాలకు కూడా వెళ్తున్నాడు.ఎక్కడికి వెళ్లినా రాజు తన కామెడీతో అందరూ అభిమానులను కడుపుబ్బా నవ్విస్తున్నాడు.

కానీ రాజు మాత్రం తన ఫెయిల్యూర్ లవ్ స్టోరీతో చాలా బాధపడుతున్నట్లు ఉన్నాడు.

Telugu Yadamma Raju, Sharley Stella, Yadammaraju-Movie

ఇక ప్రస్తుతం మరొక అమ్మాయి ప్రేమలో మునిగి తేలుతున్నాడు యాదమ్మ రాజు.  ఆమె పేరు షార్లీ స్టెల్లా అని ఏజ్ 22 అని ఆమె వివరాలు చెప్పేశాడు యాదమ్మ రాజు.ఆ అమ్మాయి తన ఫ్రెండ్ వాళ్ల ఫ్రెండ్ అని ఫస్ట్ ఫ్రెండ్ అయ్యిందని, ఇప్పుడు నా లవర్ అయ్యిందంటూ తన ప్రేమకథను ఒక టీవీ ఛానెల్ లో చెప్పుకొచ్చాడు యాదమ్మ రాజు .ఇక తన ప్రేయసి చేతికి యాదమ్మ రాజు అని తన పేరును కూడా పచ్చ బొట్టు పొడిపించుకుందట ఆ అమ్మాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube