ఏపీ కాంగ్రెస్ పై పార్టీ హైకమాండ్ ఫోకస్.. షర్మిలకు పిలుపు

ఏపీ కాంగ్రెస్ పై పార్టీ హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది.ఈ మేరకు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు గానూ తీవ్ర కసరత్తు చేస్తుంది.

 Party High Command Focus On Ap Congress.. Call To Sharmila-TeluguStop.com

ఇందులో భాగంగానే ఏపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనుంది.

ఢిల్లీలో ఇవాళ ఏఐసీసీ ఆధ్వర్యంలో జరగనున్న సమన్వయ కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో పాటు పార్టీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు.

ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరికతో పాటు బాధ్యతల నిర్వహణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.అదేవిధంగా రాష్ట్రంలో పొత్తులు, నేతల చేరికలతో పాటు పార్టీ బలోపేతంపై నేతలు చర్చించనున్నారని సమాచారం.

ఒకవేళ షర్మిల కనుక పార్టీలో చేరితే ఆమెకు స్టార్ క్యాంపైనర్ గా బాధ్యతలు అప్పజెప్పే అవకాశం ఉంది.కాగా ఇప్పటికే షర్మిలను పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు తెలిపిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఏపీ కాంగ్రెస్ సమన్వయ సమావేశం వేళ షర్మిలకు పిలుపు వచ్చిందని తెలుస్తోంది.షర్మిలను ఢిల్లీకి రావాలని అధిష్టానం పిలిచిందని సమాచారం.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనంపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube