రైళ్లలో ప్రయాణించే కొంతమంది ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తారు.పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌లో( public transport vehicles ) మంచి ప్రవర్తనతో ఉందామన్న బుద్ధి వీరికి అసలు ఉండదు.
ఇలాంటి వారిని భరించలేక ఒక్కోసారి కొందరు దేహశుద్ధి కూడా చేస్తుంటారు.అయినా ఇలాంటి మనస్తత్వం వారిలో అసలు మారదు.
అలానే పిచ్చిగా ప్రవర్తిస్తూ వేరే వారికి చాలా కోపం తెప్పిస్తుంటారు.తాజాగా ఒక ప్రయాణికుడు కూడా ట్రైన్ తన సొంత ప్రాపర్టీ అన్నట్లు ఆహారం తినడానికి ఉపయోగించే ఫుడ్ ట్రేపై దర్జాగా కాళ్ళు పెట్టుకుని నిద్రించాడు.

అతడు గురక పెడుతూ కాళ్లను డైనింగ్ ట్రేపై పెట్టి పడుకున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.Namma Kovai ట్విట్టర్ పేజీ ఆ ప్రయాణికుడికి సంబంధించిన ఫోటో షేర్ చేసింది.వైరల్ అవుతున్న ఫోటో చూస్తే అతడు తన ముందు ఉన్న ఫుడ్ ట్రే ఓపెన్ చేసి దానిపై కాలు పెట్టుకోవడం చూడవచ్చు.సాధారణంగా డైనింగ్ ట్రే పై ఫుడ్ పెట్టుకుని ప్రయాణికులు ఆహారం తింటారు.
దానిపై కాళ్లు పెట్టి మురికిగా చేస్తే ఇతర ప్రయాణికులను అనారోగ్యాల పాలు అయ్యే అవకాశం ఉంది.

ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా తనకి ఇష్టం వచ్చినట్లు ఆ ప్రయాణికుడు కాళ్ళు వేయడంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇలాంటి వ్యక్తిని ఏం చేసినా తప్పు లేదు అని మరి కొంతమంది అంటున్నారు.వీరిని చూసి ఇతరులు కూడా చెడిపోతారు.
ఇది చాలా అమర్యాదకరమైన చర్య అని ఇంకొందరు ఫైర్ అయ్యారు.ఈ ప్రయాణికుడి తీరుపై రైల్వే అధికారి అనంత్ రూపనాగుడి కూడా రియాక్ట్ అయ్యారు.
ఎవరికి ఇబ్బంది కలగకుండా బాధ్యతాయుతంగా ప్రయాణికులు ప్రవర్తించాలని విజ్ఞప్తి చేశారు.ఈ ఘటన చెన్నై వందే భారత్ లో చోటు చేసుకున్నట్లు సమాచారం.







