నా ముక్కు కోసేశాడు.. రక్తం కారిపోతుంది.. ఆ విషయాలు చెప్పిన గోపీచంద్!

టాలీవుడ్ హీరో గోపీచంద్, రాశీ ఖన్నా జంటగా నటించిన తాజా చిత్రం పక్కా కమర్షియల్.ఈ సినిమాకు దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.

 Pakka Commercial Team Gopichand Maruthi Interesting Revelations , Gopichand, Pakka Commercial Movie, Tollywood, Producer Nageswara Rao, Allu Arvind , Maruthi, Maruthi Dasari, Gopichand Maruthi Interesting Revelations-TeluguStop.com

అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 యువి క్రియేషన్స్ పతాకంపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించారు.ఈ సినిమా జులై 1వ తేదీన విడుదల కావలసి విషయం తెలిసిందే.

దీంతో ప్రస్తుతం చిత్రబృందం ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో హీరో గోపీచంద్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Pakka Commercial Team Gopichand Maruthi Interesting Revelations , Gopichand, Pakka Commercial Movie, Tollywood, Producer Nageswara Rao, Allu Arvind , MAruthi, Maruthi Dasari, Gopichand Maruthi Interesting Revelations-నా ముక్కు కోసేశాడు.. రక్తం కారిపోతుంది.. ఆ విషయాలు చెప్పిన గోపీచంద్-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తాను ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడానికి కారణమైన వారిలో నిర్మాత నాగేశ్వరరావు ఒకరని తెలిపారు గోపీచంద్.

ఆయన తనను హీరోగా పెట్టి తొలి వలపు సినిమా చేశారని అది మొదటి సినిమా కావడంతో తాను సరిగా చేస్తానో లేదో అని చాలామంది అనుమానపడ్డారట.

కానీ చివరకు ఆ సినిమా అంతగా విజయం సాధించలేదు.ఆరునెలల వరకు ఏ సినిమా రాకపోవడంతో ఆపై కొన్ని పరిస్థితుల వల్ల విలన్‌గా చేశాను.నేను చేసినవాటిలో కొన్ని ఆడవని ముందే అనిపించాయి.ఎందుకు ఒప్పుకున్నాన్రా బాబు అని మనసులో అనుకున్నాను అని చెప్పు కొచ్చారు గోపీచద్.

ఇక గోపిచంద్ చిన్నప్పుడు తన అన్న ప్రేమ్‌చంద్‌ బ్లేడు తీసుకుని గోపీచంద్ దగ్గరకు వచ్చి ముక్కు కోసి పప్పులో పెడతారా? ఎలా పెడతారు? అంటూ బ్లేడు తీసుకుని నా ముక్కు కోసేశాడట.

Telugu Allu Arvind, Gopichand, Maruthi, Maruthi Dasari, Pakka, Nageswara Rao, Tollywood-Latest News - Telugu

అప్పుడు గోపీచంద్ పెరుగన్నం తింటున్నా రక్తం కారి తన పళ్లెంలో నిండిపోయిందట.అలా హీరో గోపీచంద్ చిన్నతనంలో అంటే దాదాపు తాను ఎనిమిదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి చనిపోయారని చిన్నప్పుడే జీవితం చాలా నేర్పించింది అంటూ కాస్త ఎమోషనలయ్యాడు గోపీచంద్‌.ఇకపోతే పక్కా కమర్షియల్ సినిమా విషయానికి వస్తే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్ లు పాటలకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.

ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube