గతేడాది ఏప్రిల్ నెలలో లాంచ్ చేసిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10ఆర్ 5జీ( OnePlus 10R 5G ) ఇప్పుడు ఒక క్రేజీ ఆఫర్ తో కొనుగోలుదారుల దృష్టిని ఆకర్షిస్తోంది.ప్రస్తుతం దీనిని కొనుగోలు చేస్తే కస్టమర్లు రూ.2,299 విలువైన వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ ఇయర్‌బడ్స్( Nord Buds CE Earbuds ) పూర్తిగా ఫ్రీగా పొందవచ్చు.ఇది పరిమితకాల ఆఫర్ కాబట్టి దీన్ని సొంతం చేసుకునేందుకు యూజర్లు వీలైనంత త్వరగా మొబైల్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
వన్‌ప్లస్ 10ఆర్ 80w సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది.ఈ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ రూ.38,999కి లాంచ్ చేయగా… 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను రూ.42,999కి తీసుకొచ్చింది.150w ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 12జీబీ+256జీబీ వేరియంట్‌ను కూడా ఈ కంపెనీ పరిచయం చేసింది.దీని ధర రూ.43,999గా నిర్ణయించింది.అయితే ఈ ధరలు లాంచ్ టైమ్‌లో కంపెనీ నిర్ణయించినవి కాగా ఇప్పుడు వీటి ధరలు కొన్ని ఆఫర్ల కారణంగా రూ.4,000 వరకు తగ్గాయి.

అంతేకాకుండా వీటితోపాటు రూ.2,299 ఖరీదైన వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ సీఈ ఇయర్‌బడ్స్ లభిస్తున్నాయి.స్పెషల్ క్లోజ్డ్ ట్యూబ్ డిజైన్, డైనమిక్ డ్రైవర్, 10 మీటర్ల పరిధి, 300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో అందించారు.
ఛార్జింగ్ కేస్‌తో 20 గంటల పాటు బ్యాటరీ బ్యాకప్( Battery Backup ) పొందవచ్చు.ఫాస్ట్ ఛార్జింగ్‌తో 10 నిమిషాల్లోనే 81 నిమిషాలపాటు బ్యాటరీ బ్యాకప్ పొందొచ్చు.
అయితే కంపెనీ తక్కువ ధరల్లోనే దీన్ని తీసుకొచ్చింది కాబట్టి ఇది గొప్పగా పర్ఫార్మ్ చేయలేదు.ఇక నోకాస్ట్ ఈఎంఐ పద్ధతిలో వన్‌ప్లస్ 10ఆర్ మొబైల్స్‌ను రూ.2,000 నుంచే కొనుగోలు చేయవచ్చు.