బీఆర్ఎస్ అధినేత ,తెలంగాణ సీఎం కేసీఆర్( CM KCR ) కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా ముందుకు వెళుతున్నారు.తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో ఇప్పటి వరకు బిజీగా గడిపిన కేసీఆర్ , ఇప్పుడు పార్టీలో పరిస్థితులను చక్కటిదేందుకు శ్రీకారం చుట్టబోతున్నారు.119 నియోజకవర్గాల్లో చాలా చోట్ల గ్రూపు రాజకీయాలు పెరిగిపోవడం , అసమ్మతి తీవ్ర స్థాయిలో పెరగడం, పార్టీకి చెందిన నాయకులు ఒకరిపై ఒకరు మీడియా, సోషల్ మీడియా( Social media ) వేదికగా విమర్శలు చేసుకుంటూ పార్టీ పరువును బజారున పడేస్తూ ఉండడం వంటి విషయాలపై సీరియస్ గా దృష్టి సారించారు.ఎన్నికలకు కేవలం కొద్ది నెలలు సమయం మాత్రమే ఉండడంతో , పార్టీలో పరిస్థితి చక్కదిద్దకపోతే, రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు చాలామంది ఇతర పార్టీలో చేరే అవకాశం ఉందని భావిస్తున్న కేసీఆర్, పార్టీ నుంచి వలసలను నిరోధించేందుకు అసమ్మతి నేతలను బుజ్జగించి దారికి తెచ్చుకునేందుకు శ్రీకారం చుట్టబోతున్నారు .

దీనిలో భాగంగానే నియోజకవర్గాల వారీగా అసమ్మతి నేతలను పిలిచి బుజ్జగించాలని కెసిఆర్ ప్లాన్ చేస్తున్నారు.ఇరువర్గాలను పిలిచి సమస్యను పరిష్కరించాలని, ఒకవేళ అప్పటికి పరిష్కారం కాకపోతే పార్టీ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరికలు చేయాలని కెసిఆర్ నిర్ణయించుకున్నారట.ఇక రాష్ట్రవ్యాప్తంగా 25 మంది ఎమ్మెల్యేల పనితీరు అంతంత మాత్రమే అన్నట్టుగా సర్వే నివేదికల్లో వెల్లడి కావడంతో, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారట.దీనిలో భాగంగానే బలమైన ప్రజాధరణ కలిగిన నేతలను వెతికే పనిలో నిమగ్నం అయ్యారట.
వీలైనంత తొందరగా ఈ వ్యవహారాలను చక్కదిద్ది కార్యక్రమాలను పూర్తిచేసేందుకు కేసీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారట.ఆగస్టు తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో , కెసిఆర్ అలెర్ట్ అవుతున్నారు.
పెండింగ్ పనులను పూర్తి చేయాల్సిందిగా ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఆదేశాలు జారీ చేశారు.ఈనెల 24 నుంచి 30 వరకు పోడు పట్టాలు పంపిణీ చేయనున్నారు.అలాగే ఈ నెల 26 నుంచి రైతుబంధు ( Rythu Bandhu )సొమ్ములను అకౌంట్ల లో వేసేందుకు సిద్ధమవుతున్నారు.

బీసీ కుల వృత్తులకు లక్ష ఆర్థిక సాయం స్కీంను ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు.ఇక కాంగ్రెస్ దూకుడుగా ముందుకు వెళ్లడం, చేరికలతో హడావుడి చేస్తూ ఉండడం , అదే సమయంలో బిజెపి సైలెంట్ అయిపోవడం వంటి విషయాలపై కేసీఆర్ పూర్తిస్థాయిలో దృష్టి సారించారు.జూలై ఖమ్మంలో కాంగ్రెస్ నిర్వహించబోయే సభ తరువాత రాజకీయ పరిస్థితులు మారే అవకాశం ఉండడంతో, కేసిఆర్ ముందుగానే సిద్ధం అవుతున్నారు.
బిఆర్ఎస్ నుంచి కీలక నేతలు ఎవరు పార్టీని వీడకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటూ, పార్టీ మారే అవకాశం ఉన్న నేతల వివరాలు తెప్పించుకుంటూ వారిని బుజ్జగించే ప్రయత్నం పార్టీ కీలక నాయకుల ద్వారా చేపట్టేందుకు ఇప్పుడు ప్లాన్ చేశారట.







