మహేష్ దెబ్బకు నోరెళ్లబెట్టిన తారక్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘సర్కారు వారి పాట’ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇప్పటికే ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ కరోనా కారణంగా షూటింగ్‌ను ప్రారంభించలేకపోయారు.

 Ntr Shocked With Mahesh Babu Tweet, Ntr, Mahesh Babu, Trivikram, Tollywood News,-TeluguStop.com

దీంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాను దర్శకుడు పరశురామ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అప్పుడే అంచనాలు క్రియేట్ అయ్యాయి.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే, తన నెక్ట్స్ చిత్రాలను కూడా లైన్‌లో పెట్టేందుకు రెడీ అయ్యాడు.ఇప్పటికే దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అయిన మహేష్, ఆ తరువాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో చేసేందుకు రెడీ అయ్యాడు.

గతంలో త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అతడు, ఖలేజా చిత్రాల్లో నటించిన మహేష్, ఇటీవల ఖలేజా చిత్రం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.త్రివిక్రమ్‌తో మరోసారి పనిచేసేందుకు ఆసక్తిగా చూస్తు్న్నానంటూ మహేష్ వెల్లడించాడు.

కాగా త్రివిక్రమ్‌తో తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ప్రకటనతో అవాక్కయ్యాడు.ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రంలో నటిస్తున్న తారక్, తన 30వ చిత్రాన్ని త్రివిక్రమ్ డైరెక్షన్‌లో చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ఇప్పుడు మహేష్ కూడా తన నెక్ట్స్ మూవీని త్రివిక్రమ్‌తో చేస్తాననడంతో ముందు త్రివిక్రమ్ ఎవరితో చేస్తాడా అనే సందేహం తారక్‌లో క్రియేట్ అయ్యింది.ఒకవేళ మహేష్‌తోనే త్రివిక్రమ్ సినిమా చేస్తే, తన పరిస్థితి ఏమిటని తారక్ ఆలోచిస్తున్నట్లు చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే మహేష్ ఇప్పటికిప్పుడు త్రివిక్రమ్‌తో సినిమా చేసే అవకాశం లేదని తెలుస్తోంది.పరశురామ్‌తో సినిమా తరువాత జక్కన్నతో సినిమా చేయనున్న మహేష్, ఆ తరువాతే త్రివిక్రమ్ గురించి ఆలోచిస్తాడని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube