కొత్త ఏడాదికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ( Prime Minister Narendra Modi ) స్వాగతం పలికారు.ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలను ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేశారు.కొత్త ఏడాది( New Year )కి స్వాగతం పలుకుతూ ఉగాది పండుగ పునరుత్తేజాన్ని, కొత్తదనాన్ని వెంట తీసుకువస్తుందని ఆయన పేర్కొన్నారు.
అలాగే ఈ సంవత్సరం అందరి జీవితాలలో అమితమైన సంతోషాన్నీ, శ్రేయస్సునీ నింపాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.ఈ క్రమంలోనే పండుగ అందరి జీవితాలలో అన్ని అంశాలలో సంతోషాన్ని తీసుకువస్తుందని ఆశిస్తున్నట్లు మోదీ వెల్లడించారు.