బైక్ లవర్స్‌కి అదిరిపోయే న్యూస్.. హోండా నుంచి 300సీసీ స్క్రాంబ్లర్..

ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా తాజాగా CL300 స్క్రాంబ్లర్ బైక్‌ను ఆవిష్కరించింది.ప్రస్తుతానికి, CL300 అనేది చైనాలో మాత్రమే లభించే మోటార్‌సైకిల్.

 New Honda 300cc Scrambler Bike Debuts In India Price Specifications Details, New-TeluguStop.com

కాగా ఈ హోండా 300సీసీ స్క్రాంబ్లర్ 2023లో ముందుగా చైనాలో విడుదల కానుంది.ఆ తరువాత భారతదేశంతో సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అందుబాటులోకి రావచ్చు.

ఈ బైక్ భారతదేశంలోకి ఎంట్రీ ఇస్తే రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350, యెజ్డీ స్క్రాంబ్లర్ మొదలైన వాటికి పోటీగా నిలుస్తుంది.హోండా ఇప్పటికే థాయిలాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వంటి ఇతర దేశాలలో CL300ని ట్రేడ్‌మార్క్ చేసింది.

యూరోపియన్ మార్కెట్లు కూడా తర్వాత తేదీలో ఈ బైక్‌ ట్రేడ్‌మార్క్‌ను రిజిస్టర్ చేయవచ్చు.

అప్‌కమింగ్ హోండా CL300 బైక్ రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, రియర్ వ్యూ మిర్రర్స్, ఆల్-LED సెటప్, ఫోర్క్ గైటర్లు, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ పాడ్, గ్రిప్ ప్యాడ్‌లతో ఫ్యూయల్ ట్యాంక్, క్విల్టెడ్ మోడల్‌లో ఫ్లాట్ సీటు వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది.

హీట్ షీల్డ్ కవర్‌తో కూడిన హై-మౌంటెడ్ ఎగ్జాస్ట్ ఈ బైక్‌లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.మధ్యలో ఉంచిన ఫుట్‌పెగ్‌లు, పుల్ బ్యాక్ హ్యాండిల్‌బార్‌ వల్ల ఈ బైక్ పై రైడింగ్ స్టాన్స్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

బైక్ డిజైన్ రైడింగ్ స్టాండింగ్-అప్‌కు సపోర్ట్ చేస్తుంది.ఇది రోడ్డు లేని చోట ఈజీగా రైడ్‌ చేసేందుకు ఉపయోగపడుతుంది.

Telugu Honda Scrambler, Honda, Hondascrambler, Honda Bike, Royalenfield, Motorcy

ఈ బైక్ 790 మిమీ సీట్ హైట్ కలిగి ఉన్నందున, షార్ట్ రైడర్‌లకు కూడా ఈ బైక్‌ బాగా సూట్ అవుతుంది.ఇది ఆఫర్ చేసే 165 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఆఫ్-రోడ్‌లపై ప్రయాణించడం కూడా సాధ్యమవుతుంది.172 కిలోల కెర్బ్ వెయిట్ వల్ల దీనిని ఈజీగానే హ్యాండిల్ చేయవచ్చు.హోండా CL300 ప్రీమియం వేరియంట్‌లో కాంపాక్ట్ బాడీ-కలర్ విండ్‌స్క్రీన్, బాడీ-కలర్ నకిల్ గార్డ్‌లు, సైడ్ మౌంటెడ్ ట్రాకర్ నంబర్ ప్లేట్, టాన్ లెదర్ సీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

హోండా CL300 286cc, సింగిల్ సిలిండర్ మోటారుతో వస్తుంది.దీని పవర్ అవుట్‌పుట్ 25.7 hp కాగా ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.ఈ బైక్ రెండు చివర్లలో సింగిల్ డిస్క్ బ్రేక్‌లను ఇచ్చారు.

ఇవి డ్యూయల్-ఛానల్ ABSతో వస్తాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube