ప్రస్తుతం ప్రపంచంలో అనేక మంది ఇబ్బంది పడుతున్న సమస్యల్లో ఒకటి వారి శరీర బరువు.అందుకు గల కారణం వారి శరీరంలో కొవ్వు ఏర్పడడం.
ఆ కొవ్వును తగ్గించుకోవడానికి చాలామంది అనేక ప్రయత్నాలు చేస్తున్నా కానీ, చివరికి విజయం సాధించలేకపోతున్నారు.ముఖ్యంగా అనేక మంది వారి పొట్ట దగ్గర కొవ్వు చేరుకొని చూడటానికి ఎంతో ఇబ్బంది కరంగా కనిపించేలా పొట్ట ముందుకు వచ్చేస్తుంది.
ఇలా అనేక చోట్ల కొవ్వు పేరుకొని చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు.
ఇలాంటి వారి కోసం ముఖ్యంగా పొద్దున్నే గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలుపుకొని వాటిని ప్రతి రోజూ తీసుకోవడం ద్వారా అతి తక్కువ కాలంలోనే మీ శరీర భాగంలో పేర్కొనిపోయిన కొవ్వు చిన్న చిన్నగా కరగడం మొదలవుతుంది.
కేవలం నీరు తీసుకోవడం మాత్రమే కాకుండా… కాస్త వ్యాయామం లేదా యోగాసనాలు వంటి ప్రక్రియలు చేయడం ద్వారా మరింత ప్రయోజనం చేకూర్చవచ్చు.ముఖ్యంగా ఇలా పొట్ట దగ్గర కొవ్వు చేరడానికి గల కారణం ప్రస్తుతం చాలామంది వారి పనుల్లో భాగంగా ఒకేచోట కూర్చొని పని చేస్తున్నారు.
దీంతో వారికి శారీరక శ్రమ కూడా లేకుండా పోయింది.ఎక్కువ సేపు కూర్చొని ఉండడం ద్వారా మనం ఏదైనా ఆహార పదార్ధాలు తీసుకోవడం ద్వారా అది పొట్ట ప్రాంతంలో చేరి అక్కడ కొవ్వుగా ఏర్పడుతుంది.
కాబట్టి ఇలా ఎవరైనా ఇబ్బంది పడేవారు ఉదయము లేకపోతే సాయంత్రం వీలైనంత వరకు ఒక పదిహేను నిమిషాలు వాకింగ్ లేదా జాగింగ్ చేయడం చాలా ఉపయోగపడుతుంది.వీటితోపాటు వారు తినే ఆహార పద్ధతులు కూడా కాస్త మార్పులు చేసుకోవాలి.ప్రస్తుతం ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ద్వారా అనేక పదార్థాలను మనం ఇష్టం వచ్చినట్లు తినేస్తూ ఉంటాము.వీటిని వీలైనంత వరకు తగ్గించి, అదే సమయంలో పండ్లను తీసుకుంటే చాలా వరకు మీ శరీరంలో ఏర్పడే కొవ్వును సులువుగా తగ్గించుకోవచ్చు.
అలాగే మీరు తినే ఆహారంలో అల్లం, వెల్లుల్లి లాంటి పదార్థాలు తీసుకోవడం ద్వారా శరీరంలోకి యాంటీ ఆక్సిడెంట్స్ చేరి కొవ్వును కరిగించడంలో చాలా బాగా ఉపయోగపడతాయి.కాబట్టి వీలైనంత వరకు సమయాన్ని కుదించుకుని వాకింగ్ లేదా జాగింగ్, యోగా లాంటి వాటిని చేయగలిగితే బరువుతో పాటు మీ శరీరంలో ఉండే కొవ్వును బాగా తగ్గించవచ్చు.