శ్యామ్ సింగ రాయ్ రిజెక్ట్ చేసిన స్టార్ హీరో..!

ట్యాక్సీ వాలా సినిమాతో డైరక్టర్ గా తన టాలెంట్ చూపించిన రాహుల్ సంకృత్యన్ తన సెకండ్ ప్రాజెక్ట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమా చేస్తున్నాడు.నాచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టితో పాటుగా మళయాళ భామ మడోనా సెబాస్టియన్ కూడా నటిస్తుంది.

 Nani Shyam Singha Roy Rejected By Star Hero , Latest Movie News, Nani , Naturals-TeluguStop.com

ఈ సినిమాలో నాని డ్యుయల్ రోల్ చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈమ్మధ్యనే శ్యామ్ సింగ రాయ్ టైటిల్ సాంగ్ రాగా ఆ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచింది.

ఇక ఇదిలాఉంటే శ్యామ్ సింగ రాయ్ సినిమా కథ దర్శకుడు రాహుల్ ముందు నాని కోసం రాసుకోలేదట.ఈ సినిమా కథను ముందు దగ్గుబాటి హీరో రానాతో తీయాలని అనుకున్నాడట.

రానాతో కథా చర్చలు కూడా జరిపినట్టు తెలుస్తుంది.అయితే రానా ఎందుకో ఈ కథను రిజెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఆల్రెడీ తను చేసిన సబ్జెక్ట్ లా అనిపించిందో లేక మరే కారణమో తెలియదు కాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను రానా వద్దనుకున్నాడట.అయితే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుండగా సినిమా మీద ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు నాని.

సినిమాలో చాలా సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube