జనసేన పార్టీ నేత నాగబాబు( nagababu ) శనివారం తెనాలి నియోజకవర్గ జనసైనికులు వీర మహిళల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ జనసేన వచ్చే తరాల కోసం పెట్టిన పార్టీ అని అన్నారు.
ఎన్నికలలో వెంటనే గెలవాలనే పెట్టిన పార్టీ కాదని వ్యాఖ్యానించారు.గత పది సంవత్సరాల నుంచి జయాపజయాలకతీతంగా పోరాటం చేస్తున్నాం.
సాధారణంగా ఓడిపోతే జనాలు ఆ నాయకుడిని పట్టించుకోరు.కానీ ఓడిపోయే కొద్ది బలపడుతున్న రాజకీయ నేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )అని నాగబాబు అభివర్ణించారు.
రాజకీయాలలో మాత్రమే కాదు సినిమా ఇండస్ట్రీలో పరాజయాలు ఎదురైనా నెక్స్ట్ సినిమాకి పవన్ బిజినెస్ పెరగటం అతని స్టామినాని నిరూపిస్తది.కారణం మానవత్వంగా పవన్ ప్రజలకి కనెక్ట్ అయిపోయారు.
ఇదే సమయంలో నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar )పై నాగబాబు పొగడ్తల వర్షం కురిపించారు.జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ తర్వాత అత్యంత ముఖ్యమైన నాయకుడు మనోహర్ అని తెలిపారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు ఎక్కువైపోయాయి.మరోసారి వైయస్ జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రాలో 50% జనాభా ఖాళీ అయిపోతుంది అని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి.పర్యావరణం నాశనం అయిపోయింది.
ఈ క్రమంలో వచ్చే ఎన్నికలలో జగన్ ని ఓడించడానికి ప్రజల సిద్ధంగా ఉన్నారని నాగబాబు అన్నారు.టీడీపీ జనసేన ప్రభుత్వం వచ్చాక.
సంక్షేమం, అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు.