తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )ఒకరు.ఈయన మెగా హీరోగా ఇండస్ట్రీలోకి చిరుత సినిమా ద్వారా అడుగు పెట్టారు.
మొదటి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నటువంటి రామ్ చరణ్ అనంతరం మగధీర సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అభిమానులు ఎంత సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సినిమా తర్వాత ఆరెంజ్ వంటి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.అయితే ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
![Telugu Bolllywood, Chiranjeevi, Game Changer, Ram Charan, Surekha, Thufan, Tolly Telugu Bolllywood, Chiranjeevi, Game Changer, Ram Charan, Surekha, Thufan, Tolly](https://telugustop.com/wp-content/uploads/2024/03/tollywood-chiranjeevi-ram-charan-thufan-upasana-bolllywood-viral-Game-Changer.jpg)
మగధీర సినిమా ఎంతో మంచి సక్సెస్ కావడంతో రామ్ చరణ్ కు బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు వచ్చాయి ఏకంగా బాలీవుడ్లో సినిమా అవకాశం రావడంతో ఈయన ఆ సినిమాకు కమిట్ అయ్యారు.ఇలా మొదట నటించిన బాలీవుడ్ చిత్రం జంజీర్( Janjeer ).ఈ సినిమా తెలుగులో తుఫాన్ పేరిట ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అపూర్వ లఖియా డైరెక్ట్ చేసిన జింజీర్ లో రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటించారు.
ప్రకాష్ మెహ్రా ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్స్, రాంపేజ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ 2013లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా కొట్టింది.
![Telugu Bolllywood, Chiranjeevi, Game Changer, Ram Charan, Surekha, Thufan, Tolly Telugu Bolllywood, Chiranjeevi, Game Changer, Ram Charan, Surekha, Thufan, Tolly](https://telugustop.com/wp-content/uploads/2024/03/Zanzeer-surekha-tollywood-chiranjeevi-ram-charan-thufan-upasana-bolllywood-viral.jpg)
ఇక తెలుగులో కూడా ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.ఈ సినిమా సమయంలో రామ్ చరణ్ పై బాలీవుడ్ సెలబ్రిటీలు చేసిన కామెంట్స్ రామ్ చరణ్ తల్లి సురేఖను ఎంతగానో బాధించాయట ఈయన హీరోగా పనికిరారని ఏకంగా బాలీవుడ్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది.ఇలా తన కొడుకుకు నటన రాదు అంటూ హేళన చేయడంతో ఈ సినిమాని చూసినటువంటి రామ్ చరణ్ తల్లి సురేఖ రామ్ చరణ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారట .ఇకపై నువ్వు ఇలాంటి సినిమాలను నీ కెరియర్లో చేయకూడదు అంటూ తనకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారని తెలుస్తుంది.అంతేకాకుండా రాంచరణ్ సినీ కెరియర్ లో సురేఖకు నచ్చని సినిమా కూడా ఇదేనని చెప్పాలి.
ఇలా జంజీర్ సినిమా సమయంలో తన కొడుకుకు సురేఖ ఈ విధమైనటువంటి వార్నింగ్ ఇచ్చారంటూ తాజాగా ఈ వార్తలు అవుతున్నాయి.
![Telugu Bolllywood, Chiranjeevi, Game Changer, Ram Charan, Surekha, Thufan, Tolly Telugu Bolllywood, Chiranjeevi, Game Changer, Ram Charan, Surekha, Thufan, Tolly](https://telugustop.com/wp-content/uploads/2024/03/Zanzeer-surekha-tollywood-chiranjeevi-ram-charan-thufan-upasana-bolllywood-viral-Game-Changer.jpg)
ఇక ప్రస్తుతం ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకొని బాలీవుడ్ ఇండస్ట్రీచేత సలాం కొట్టించుకుంటున్నారు.ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్నటువంటి రామ్ చరణ్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు.ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.