గ్రేట్ : కరోనా వైద్యులకు సేవలందిస్తున్న మిస్ ఇంగ్లాండ్... 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఎంతగా కలకలం సృష్టిస్తోందో పెద్దగా చెప్పనవసరం లేదు.అయితే ఈ కరోనా వైరస్ ని అరికట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు మరియు సినీ సెలబ్రిటీలు ముందుకొస్తున్నారు.

 Miss England, Bhasha Mukharjee, Doctor, Corona Virus, Medical Emergency, Miss En-TeluguStop.com

అయితే ఇప్పటికే కొంతమంది తమకు తోచినంత డబ్బుని విరాళాల రూపంలో ప్రకటిస్తుంటే మరి కొంతమంది మాత్రం తమ సేవలు రూపంలో సేవలందిస్తున్నారు.

తాజాగా ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి మిస్ ఇంగ్లాండ్ భాష ముఖర్జీ తన మిస్ ఇంగ్లాండ్ కిరీటాన్ని పక్కనపెట్టి మరీ తన దేశ ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చింది.

అయితే ఒకప్పుడు మోడలింగ్ తోపాటు వైద్యానికి సంబంధించిన చదువును కూడా పూర్తి చేసినటువంటి భాష ముఖర్జీ ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రిలో తన సేవలు అందిస్తోంది.

దీంతో దేశానికి చెందినటువంటి పలువురు ప్రముఖులు మరియు సినీనటులు భాషా ముఖర్జీ చేస్తున్నటువంటి సేవలను ప్రశంసిస్తున్నారు.

మరోపక్క ఈమె భారత సంతతికి చెందినటువంటి మహిళ కావడం విశేషం. అంతేకాక ఒకప్పడు తనని మిస్ ఇంగ్లాండ్ గా నిలిపినటువంటి తన దేశ ప్రజలకు తన సేవలు అందిస్తున్నందుకు ఒక పక్క సంతోషంగా ఉందని, కానీ కరోనా వైరస్ చాలా ప్రమాదకారి అని, కాబట్టి ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకుంటూ కరోనా వైరస్ బారిన పడకుండా ఉండాలని సూచిస్తోంది ఈ అమ్మడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా యునైటెడ్ కింగ్డమ్ లో ఇప్పటివరకు 81,422 కరోనా కేసులను గుర్తించగా ఇందులో 12వేల పైచిలుకు మంది మృతి చెందారు.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ఇప్పటివరకు ఈ కరోనా వైరస్ సోకినటువంటి వారిలో ఒక్కరు కూడా కోలుకోలేక పోయారు.

దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కరోనా వైరస్ ఎంత ప్రమాదకారో అని.అందువల్ల వైద్యులు నిత్యం ప్రజలను సామాజిక దూరం పాటిస్తూ చేతులను శానిటైనర్లు, డబ్బులతో శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తున్నారు.

అంతేగాక దగ్గు, జలుబు, ఫ్లూ జ్వరం, వంటి లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యాధికారులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube