మాస్ మహారాజతో మెగాస్టార్ పక్కా మాస్ సినిమా..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా పూర్తి చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం గాడ్ ఫాదర్ చిత్రంతో బిజీగా ఉన్నారు.

 Megastar Mass Movie With Mass Maharaja Ravi Tejachiranjeevi, Ravi Teja, Tollywoo-TeluguStop.com

ఇదిలావుండగా తాజాగా నేడు మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రం భోళా శంకర్ సినిమా పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు.ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి తన 154 వ చిత్రాన్ని కె.ఎస్.రవీంద్ర దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ మాస్ చిత్రంగా తెరకెక్కుతోందని దర్శకుడు తెలియజేశారు.ఇకపోతే ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటించడానికి మరొక హీరో అవసరం ఉందని ఆ పాత్రలో చేయడానికి దర్శకుడు మాస్ మహారాజ రవితేజను ఎంపిక చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో రవితేజ ఒక క్యామియో రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం.ఈ విషయం గురించి చిత్ర బృందం అధికారికంగా తెలియజేయాల్సి ఉంది.

Telugu Chiranjeevi, Heroes, Mass, Ravi Teja, Tollywood-Movie

ఇకపోతే క్రాక్ సినిమా తర్వాత రవితేజ రామారావు ఆన్ డ్యూటీ, ఖిలాడీ సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇక రవితేజ కెరియర్ మొదట్లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి పలు సినిమాల్లో సందడి చేసిన సంగతి మనకు తెలిసిందే.చాలా రోజుల తర్వాత మెగాస్టార్ తో కలిసి నటించే అవకాశం వస్తే రవితేజ ఎలాంటి పరిస్థితులలోనూ వదులుకోరని చెప్పవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube