కొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి.ఇదే తరుణంలో ప్రతి నియోజకవర్గంలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది.
ఇప్పటికే కేసీఆర్ ( Kcr ) 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు.ముందస్తు ప్లానింగ్ ప్రకారం ముందుకు పోతున్నారు.
ఈ నేపథ్యంలోనే బిఆర్ఎస్ ఎమ్మెల్యే హనుమంతరావు ( Brs Mla Hanumantha rao ) కాస్త రచ్చ చేశారు. మల్కాజ్ గిరి ఎమ్మెల్యే సీటు తనకు వచ్చింది కానీ ఇంకో సీట్ మెదక్ నియోజకవర్గం సీట్ కేటాయించాలని తిరుగుబాటు జెండా ఎగరవేశారు.
ఇక ఆ రగడ టికెట్ కేటాయించినప్పటి నుంచి జరుగుతుంది.ఈ విధంగా మెదక్ నియోజకవర్గమే కాకుండా జిల్లాలోని మొత్తం నియోజకవర్గాల్లో చాలా వరకు అసమ్మతి చెలరేగుతోందట.
ఆ వివరాలు ఏంటో చూద్దాం.
![Telugu Delhi Vasanth, Harish Rao, Jahirabad, Mahipal Reddy, Mainampalli, Manik R Telugu Delhi Vasanth, Harish Rao, Jahirabad, Mahipal Reddy, Mainampalli, Manik R](https://telugustop.com/wp-content/uploads/2023/09/cm-kcr-brs-party-bjp-party-congress-party-Harish-rao-Padma-Devenderreddy-Medak.jpg)
కేసిఆర్ హరీష్ రావు ( Harish rao ) సొంత జిల్లా అయిన మెదక్ కెసిఆర్ ను ఇబ్బందులు పెడుతుందని చెప్పవచ్చు.ఈ జిల్లాలో అన్ని స్థానాలకు కేసీఆర్ అభ్యర్థులను ఇప్పటికే ఖరారు చేశారు.ఇదే తరుణంలో జిల్లా కేంద్రమైన మెదక్ లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డికి వ్యతిరేకంగా మైనంపల్లి రోహిత్ ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
దేవేందర్ రెడ్డి మెదక్ ( Medak ) ను ఏ విధంగా అభివృద్ధి చేయలేదని తిరుగుబాటు చేస్తున్నారు.
![Telugu Delhi Vasanth, Harish Rao, Jahirabad, Mahipal Reddy, Mainampalli, Manik R Telugu Delhi Vasanth, Harish Rao, Jahirabad, Mahipal Reddy, Mainampalli, Manik R](https://telugustop.com/wp-content/uploads/2023/09/cm-kcr-brs-party-bjp-party-congress-party-Harish-rao-Padma-Devenderreddy-Medak-Mynampally-Rohith.jpg)
ఇదే తరుణంలో పద్మ దేవేందర్ రెడ్డి ( Padma Devenderreddy ) కి వ్యతిరేకంగా కొంతమంది బిఆర్ఎస్ నేతలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం.ఇక పటాన్ చెరు విషయానికి వస్తే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి వ్యతిరేక వర్గం ఏర్పడింది.ఈ టికెట్ పై కేసీఆర్ మళ్ళీ ఆలోచన చేయాలని బీసీ వర్గం రోడ్డెక్కుతున్నారు.
ఇక్కడి బీసీ నేత నీలం మధు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తన గళాన్ని వినిపిస్తున్నారు.అలాగే జహీరాబాద్ లో కూడా మాణిక్ రావు (Manik rao) కు వ్యతిరేకంగా ఆ నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
ఢిల్లీ వసంత్ మాణిక్ రావుకు కొరకని కొయ్యగా మారారు.ఈ విధంగా కేసీఆర్, హరీష్ రావు ప్రాతినిధ్యం వహించే సొంత జిల్లాల్లోనే అభ్యర్థుల మధ్య సఖ్యత కుదరక అనేక ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
దీంతో సీఎం కేసీఆర్ సతమతమవుతున్నట్టు తెలుస్తోంది.