అమర్‌నాథ్ యాత్రకువెళ్లిన పలువురు తెలుగువారు కాశ్మీర్‌లోయలో జరుగుతున్న కర్ఫ్యూ కారణంగా చిక్కుకుపోయినట్ట సమాచారం.నెల్లూరు,ప్రకాశం జిల్లాలకు చెందిన వారు వీరిలో ఎక్కువగా ఉన్నారని, వీరంతా అమరనాధ్ చేరుకోవాల్స ఉన్నప్పటికీ ఉ్రగవాది వనీ ఎన్ కౌంటర్‌తో కశ్మీర్‌లో పోలీసులపై జరిగిన రాళ్లదాడి ఉద్రిక్తంగా మారటంతో వీరందరినీ సురక్షిత ్రపాంతాలకు తరలించే ఏర్పాటు అధికారులు చేస్తున్నట్టు తెలుస్తోంది.
కాగా అమర్ నాథ్ లింగేశ్వరున్ని దర్శించుకు న్న తర్వాత తిరుగు ప్రయాణంలో శ్రీనగర్ బల్తాల్ వద్ద మరి కొందరు యాత్రికులు చిక్కుకున్నారు.వీరంతా ఈ నెల 13న వారు ఆగ్రా కు చేరుకోవల్సి ఉన్నా, పరిస్థితులు అనుకూలించటం లేదని బంధుమిత్రులకు సమాచారం ఇవ్వటంతో వారంతా ఆందోళనలో ఉన్నారు.
కాగా అమర్‌నాథ్ యాత్రకు వెళ్లి చిక్కుకున్నతెలుగువారితో తను మాట్టాడానని, అంతా క్షేమంగానే ఉన్నట్టు ఏపీ మంత్రి శిద్దా రాఘవరావు మీడియాకు తెలిపారు.యాత్రికులను సురక్షితంగా వారి వారి ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు ఆదేశాలిచ్చామని, త్వరలోనే కశ్మీర్ నుంచి తీసుకు వస్తామని తెలిపారు.